Moviesఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ సినిమాకు ఆ బ్యాడ్ సెంటిమెంట్‌…!

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ సినిమాకు ఆ బ్యాడ్ సెంటిమెంట్‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుత వయసు 41. దేవర 1 సినిమాతో కలిసి ఇప్పటివరకు ఎన్టీఆర్ 30 సినిమాలు చేశారు. ఈ 30 సినిమాలలో సంక్రాంతికి వచ్చినవి కేవలం ఐదు సినిమాలు మాత్రమే. తాజాగా ఎన్టీఆర్ – ప్రశాంత నీల్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ సంక్రాంతి సినిమాపై సెంటిమెంట్ పరంగా ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఎన్టీఆర్ నటించిన సంక్రాంతికి రిలీజ్ అయిన ఐదు సినిమాలలో సక్సెస్ అయినవి రెండు మాత్రమే.

మళ్లీ ఇన్ని సంవత్సరాలకు సంక్రాంతి బరిలో నిలిచాడు. ఎన్టీఆర్ కెరియర్లో నా అల్లుడు – ఆంధ్రావాలా – నాగ – అదుర్స్ – నాన్నకు ప్రేమతో సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ఇందులో తొలి మూడు సినిమాలో డిజాస్టర్లు. అదుర్స్ – నాన్నకు ప్రేమతో సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఒక దశలో ప్రతి ఏటా సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ చేసేవాడు ఎన్టీఆర్. 2003 – 2004 – 2005 సంక్రాంతికి వరుసగా ఎన్టీఆర్ సినిమాలు వచ్చాయి. అయితే నాగ – ఆంధ్రావాలా – నా అల్లుడు మూడు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి.

నా అల్లుడు తర్వాత సంక్రాంతికి రావటం తగ్గించేశాడు. ఎన్టీఆర్ మళ్ళీ 2010లో 5 ఏళ్లకు అదుర్స్ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి సంక్రాంతికి తొలి విజయం నమోదు చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఆరేళ్లకు 2016 లో నాన్నకు ప్రేమతో సినిమాతో సంక్రాంతికి వచ్చి మళ్లీ హిట్ కొట్టాడు. నాన్నకు ప్రేమతో సినిమా వచ్చిన 10 ఏళ్ల తర్వాత 2026 సంక్రాంతికి ప్రశాంత్ నీల్‌ సినిమాతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. మరి ఈసారి ఎన్టీఆర్ సంక్రాంతి సెంటిమెంట్ ఏమవుతుందో ? చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news