చేపకళ్ళ సుందరి తాప్సీ తన రింగుల జుట్టుతో చబ్బీ చీక్స్ తో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. అలా ఈమె టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది మంచు మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ ఝుమ్మంది నాదం సినిమా ద్వారా. రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో తాప్సి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా తాప్సికి మొదటి సినిమానే అయినప్పటికీ ఈ సినిమా ద్వారా తన అందాలను ఆరబోసి ప్రేక్షకులకు దగ్గరైంది.
గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న తాప్సి ఆ తర్వాత తెలుగులో వచ్చిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలలో సెకండ్ హీరోయిన్ గానే చేసింది. అలా వీర,మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాల్లో చేసినప్పటికీ ఈ ముద్దుగుమ్మకి అంత గుర్తింపు అయితే రాలేదు. దాంతో టాలీవుడ్ లో క్రేజ్ ఎక్కువగా లేకపోవడంతో బాలీవుడ్ కి వెళ్ళింది. అయితే సౌత్ ప్రేక్షకులు తాప్సీ ఎక్కువగా ఆరాధించకపోయినప్పటికీ బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం తాప్సీ నటనకు బ్రహ్మరథం పట్టారు. అలా అక్కడ ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కంగనా తర్వాత బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది.
అలా ఈమె చేసిన హిందీ సినిమాలు సూపర్ హిట్ కొట్టడంతో బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. ఇక ఏడాది మథియాస్ బో అనే వ్యక్తిని సీక్రెట్ గా పెళ్లి చేసుకొని వైవాహిక బంధం లోకి కూడా అడుగుపెట్టింది తాప్సి. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఓ హీరోని ప్రేమించి చివరికి రాఖీ కట్టాలని చూసిందట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు రాఖి ఎందుకు కట్టాలనుకుంది అనేది ఇప్పుడు చూద్దాం..
తాప్సి సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే మంచు మనోజ్ తో ప్రేమలో పడిందని, వారిద్దరి మధ్య ఎఫైర్ ఉండడం వల్లే ఝుమ్మంది నాదం సినిమాలో మంచి కెమిస్ట్రీ ఏర్పడింది అని ఓ రూమర్ ఇండస్ట్రీలో వైరల్ అయింది.అయితే ఈ రూమర్ వినగానే అటు తాప్సి ఇటు మనోజ్ ఇద్దరు నవ్వుకున్నారట. కానీ ఈ విషయం అలాగే కొనసాగే సరికి తాప్సి ఓ సమయంలో నేను ఎవరిని ప్రేమించలేదు.మనోజ్ తో వచ్చిన వార్తలన్నీ రూమర్సే. నేను ఇప్పటికీ హైదరాబాద్ కి వస్తే ఎవరింటికి వెళ్లాలి అని కూడా ఆలోచించను. నేరుగా మంచు వారింటికి వెళ్తాను. నాకు మంచు ఫ్యామిలీతో అంత కనెక్షన్ ఏర్పడింది. మనోజ్ ను నేను ఎప్పుడూ అలా చూడలేదు.ఇక మీ అనుమానం పోవాలంటే మనోజ్ కి రాఖీ కట్టాలి. నేను రాఖీ కట్టడానికి కూడా వెనకాడను ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అంటూ తాప్సి క్లారిటీ ఇచ్చింది.