Moviesమ‌హేష్ బాబు త‌న‌యుడి ఫిల్మ్ ఎంట్రీపై వీడిన స‌స్పెన్స్‌.. గౌత‌మ్ ప్లాన్...

మ‌హేష్ బాబు త‌న‌యుడి ఫిల్మ్ ఎంట్రీపై వీడిన స‌స్పెన్స్‌.. గౌత‌మ్ ప్లాన్ ఇదే!

సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. తనదైన ప్రతిభతో స్టార్ హీరోగా ఎదిగాడు. తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకున్నాడు. బాలనటుడిగా అనేక చిత్రాల్లో మెప్పించిన మహేష్.. ప్రస్తుతం హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇక మహేష్ బాబు వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఆయన కూతురు సితార ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే.

11 ఏళ్ల ఈ చిన్నారి ఇప్పటినుంచే యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కోసం అన్ని విధాల సిద్ధం అవుతుంది. అయితే మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని ఫిల్మ్ ఎంట్రీ పై చాలా కాలం నుంచి సస్పెన్స్ నడుస్తోంది. గౌతమ్ ఫ్యూచర్ లో హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని మహేష్ అభిమానులను ఎంతగానో ఆశపడుతున్నారు. కానీ ఇంతవరకు గౌతమ్ సినిమాల్లోకి వస్తున్నట్టు ఎటువంటి సూచన చేయలేదు. అసలు గౌతమ్‌ సినిమాలోకి వస్తాడా..? రాడా..? అనే అనుమానాలు దాదాపు అందరిలోనూ ఉన్నాయి.

అయితే ఆ అనుమానాలకు తాజాగా సితార పాప తెర దించింది. తన అన్నయ్య ఫ్యూచర్ ప్లాన్ ఏంటో రివీల్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార.. యాక్టింగ్ పై తనకున్న ఫ్యాషన్ బయటపెట్టింది. తాను ప్ర‌స్తుతం నటనలో మెళ‌కువలు నేర్చుకుంటున్నానని.. ఢిల్లీ, లండన్ వంటి పలు చోట్ల జరిగిన యాక్టింగ్ ఎగ్జామ్స్ కు అటెండ్ అవుతున్నానని సితార తెలిపింది. అలాగే గౌతమ్ ఫిల్మ్‌ ఎంట్రీ పై కూడా సితార క్లారిటీ ఇచ్చారు.

త‌న‌తో పాటు తన అన్నయ్య గౌతమ్ కూడా యాక్టింగ్ నే కెరీర్ గా సెలెక్ట్ చేసుకున్నాడని.. న్యూయార్క్ ఫిల్మ్‌ అకాడమీలో నాలుగేళ్లు యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల‌ని గౌత‌మ్ ప్లాన్ చేసుకున్నాడని సితార చెప్పుకొచ్చింది. అలాగే తాము యాక్టింగ్ ప్రొఫెషన్ ను ఎంచుకున్నందుకు తన తండ్రి మహేష్ బాబు చాలా హ్యాపీగా ఉన్నారని.. మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారని కూడా సితార పేర్కొంది. దీంతో మ‌హేష్ బాబు వార‌సులిద్ద‌రూ ఇండ‌స్ట్రీలోకి రావ‌డం క‌న్ఫార్మ్ అయిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news