సమంత అక్కినేని నాగచైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ప్రెగ్నెన్సీ వచ్చిందని, కానీ నాగచైతన్య సమంతకు అబార్షన్ చేయించారు అంటూ గతంలో బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు ఒక సంచలన ట్వీట్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ట్వీట్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అది నిజమే కావచ్చు అనిపిస్తుంది.. ఎందుకంటే రీసెంట్గా నాగచైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో గతంలో సమంత పెట్టిన పోస్టులన్నీ నాగచైతన్యను పరోక్షంగా విమర్శించినట్టే అనిపిస్తున్నాయి.
ఇక విషయంలోకి వెళ్తే..ఎంతో మంచి లైఫ్ లీడ్ చేస్తున్న సమంత నాగచైతన్య లైఫ్ లోకి ఎలా వచ్చిందో ఏమో తెలియదు కానీ శోభిత ఎంట్రీ ఇచ్చి వీరిద్దరి జీవితాన్ని పాడు చేసిందని సమంత నాగచైతన్య వీరాభిమానులు శోభితను తెగ తిట్టుకుంటున్నారు. అంతేకాదు నాగచైతన్య శభిత ని పెళ్లి చేసుకోవడాన్ని కూడా ఇష్టపడడం లేదు.. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించినందుకే సమంతతో నాగచైతన్యకి విభేదాలు వస్తే సమంత కంటే ఇంకా బోల్డ్ గా ఉండే శోభితతో నాగచైతన్య ఎలా కాపురం చేస్తాడు.. అని చాలామంది ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు.
అయితే గతంలో సమంత ప్రెగ్నెంట్ అయిందట. కానీ నాగచైతన్యత శోభితకి ఉన్న రిలేషన్ కారణంగానే నాగచైతన్య అబార్షన్ చేయించారనే రూమర్ గట్టిగా వినిపించింది. ఇక ఈ రూమర్ కి తోడు గత ఏడాది ఉమైర్ సందు సమంత ప్రెగ్నెన్సీని నాగచైతన్య తీయించారని, నాగచైతన్య సమంతని చాలా టార్చర్ చేశాడని, ఆ టార్చర్ తట్టుకోలేకే సమంత విడాకులు ఇచ్చిందనే పోస్ట్ పెట్టాడు. అయితే తాజాగా నాగచైతన్య రెండో పెళ్లి మ్యాటర్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో శోభిత వల్లే సమంత ప్రెగ్నెన్సీ పోయింది అని చాలామంది భావిస్తున్నారు.
అంతేకాదు గతంలో సమంత నాగచైతన్యల విడాకులు తీసుకోకముందు సమంత ట్విట్టర్ వేదికగా మా లైఫ్ లోకి ‘S’ అనే లెటర్ ఎంట్రీ వల్ల మా లైఫ్ ఇబ్బందుల్లో పడింది అని పరోక్షంగా ట్వీట్ పెట్టింది. కానీ అప్పట్లో ఈ ట్వీట్ ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. అయితే ఈ ట్వీట్ ని డిలీట్ చేయమని చైతన్య ఎంత వారిచ్చినా కూడా సమంత ఒప్పుకోలేదట. అలా కొద్ది కొద్దిగా వీరి మధ్య దూరం పెరుగుతూ వచ్చి చివరికి పూర్తిగా విడాకులు తీసుకున్నారట.