దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని.. సరిపోదా శనివారం తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఆశపడుతున్నాడు. డివివి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితమైన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా.. ఎస్.జె. సూర్య ప్రతినాయకుడి పాత్రను పోషించాడు.
రూ. 90 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార కార్యక్రమాల ద్వారా చిత్ర బృందం మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి.
తెలుగు రైట్స్ ను చాలా రోజుల క్రితమే ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు రూ. 25 కోట్లకు కొనుగోలు చేశారు. వరల్డ్ వైడ్ గా సరిపోదా శనివారం చిత్రానికి రూ. 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఓవర్సీస్ లో కూడా నాని మూవీ థియేట్రికల్ రైట్స్ మంచి ధర పలికాయట. దీంతో ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టాలంటే నాని ముందున్న టార్గెట్ రూ. 43 కోట్లు.
ఫుల్ రన్ లో రూ. 43 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ ను వసూల్ చేస్తే సరిపోదా శనివారం చిత్రం థియేటర్స్ లో క్లీన్ హిట్ గా నిలుస్తుంది. కాగా, నాని మార్కెట్ తో పోల్చుకుంటే ఇది పెద్ద టార్గెట్ అయితే ఏమీ కాదు. నాని నటించిన దసరా చిత్రం రూ. 63.55 కోట్ల షేర్, రూ. 115.00 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే హాయ్ నాన్న రూ. 72 కోట్లకు వసూళ్లను కొల్లగొట్టింది. సో.. టాక్ పాజిటివ్ గా ఉంటే సరిపోదా శనివారం థియేటర్స్ లో చెలరేగిపోవడం ఖాయం.