Moviesస‌రిపోదా శ‌నివారం ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. టాక్ అలా, క‌లెక్ష‌న్స్ ఇలా!

స‌రిపోదా శ‌నివారం ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. టాక్ అలా, క‌లెక్ష‌న్స్ ఇలా!

న్యాచుర‌ల్ స్టార్ నాని తాజాగా స‌రిపోదా శ‌నివారం అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్రియాంక మోహ‌న్ హీరోయిన్ గా.. ఎస్‌.జె సూర్య విల‌న్ గా న‌టించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఈ శుక్ర‌వారం స‌రిపోదా శ‌నివారం తెలుగుతో స‌హా మొత్తం ఐదు భాష‌ల్లో విడుద‌లైంది.

భారీ అంచ‌నాల న‌డుమ వ‌చ్చిన ఈ సినిమాకు నాని అభిమానుల నుంచే కాకుండా ప్రేక్ష‌కుల నుంచి సైతం సానుకూల స‌మీక్ష‌లు ల‌భించాయి. మెజారిటీ పీపుల్ సినిమా సూప‌ర్ అంటూ రివ్యూ ఇచ్చారు. అయితే టాక్ అనుకూలంగా వ‌చ్చిన‌ప్ప‌టికీ.. వ‌ర్షాలు కార‌ణంగా తొలి రోజు నాని సినిమా అనుకున్న స్థాయిలో ఇంప్యాక్ట్ చూప‌లేక‌పోయింది. కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తుందని అంతా అనుకున్నా.. వారి అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. కానీ డీసెంట్ క‌లెక్ష‌న్స్ ను సాధించింది.

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.88 కోట్ల షేర్‌, రూ. 8.85 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన స‌రిపోదా శ‌నివారం మూవీ.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 11.38 కోట్ల షేర్‌, రూ. 20.40 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 41 కోట్ల రేంజ్ లో జ‌ర‌గ‌గా.. రూ. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో నాని మూవీ బ‌రిలోకి దిగింది. టార్గెట్ రీచ్ అవ్వాలంటే మొద‌టి రోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా ఇంకా రూ. 30.62 కోట్ల షేర్ వ‌సూల్ చేస్తే బాక్సాఫీస్ వ‌ద్ద స‌రిపోదా శ‌నివారం క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఎలాగో టాక్ పాజిటివ్ గా ఉంది కాబ‌ట్టి.. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వ‌డం పెద్ద క‌ష్ట‌మేమి కాదు. కాగా, ఏరియాల వారీగా స‌రిపోదా శ‌నివారం ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి..

నైజాం: 2.75 కోట్లు
సీడెడ్: 74 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 77 ల‌క్ష‌లు
తూర్పు: 33 ల‌క్ష‌లు
పశ్చిమ: 32 ల‌క్ష‌లు
గుంటూరు: 32 ల‌క్ష‌లు
కృష్ణ: 41 ల‌క్ష‌లు

నెల్లూరు: 24 ల‌క్ష‌లు

AP-TG మొత్తం = 5.88 కోట్లు(8.85కోట్లు~ గ్రాస్‌)

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 1.10 కోట్లు

ఓవ‌ర్సీస్: 4.40 కోట్లు

వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్ = 11.38 కోట్లు(20.40కోట్లు~ గ్రాస్)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news