టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడు ఏదోలా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. సమంత గత పది సంవత్సరాలుగా తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు సౌత్ ఇండియా సినీ ప్రేక్షకులతో ప్రత్యేకమైన అనుబంధాన్ని పెనవేసుకున్నారు. ఒకప్పుడు ఆమె వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోలు పక్కన సినిమాలు చేస్తూ సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. సమంత సినిమాలో ఉంది అంటే చాలు సూపర్ డూపర్ హిట్ అన్నంత క్రేజ్ ఆమె సొంతం చేసుకున్నారు. తన తొలి సినిమా హీరో అక్కినేని నాకే చైతన్యను ఏడు ఎనిమిది సంవత్సరాలపాటు గాఢంగా ప్రేమించి… ఆ తర్వాత 2017 లో పెళ్లి చేసుకున్నారు.
అనంతరం 2021లో సమంత – చైతూ దంపతులు మనస్పర్ధల నేపథ్యంలో విడాకులు తీసుకున్నారు. ఇక చైతు తాజాగా మరో హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నాడు. సమంత ఇంకా సింగల్ గానే ఉంటుంది. అయితే ఆమెపై కూడా ప్రేమ పుకార్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సమంత సినిమాల పరంగాను.. వాణిజ్య ప్రకట నల ద్వారా భారీగా డబ్బులు కూడా పెట్టింది. ఇక సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా ప్రమోషన్లు చేస్తూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంది.
ఇది ఇలా ఉంటే సమంత ప్రస్తుతం ఆరోగ్యపరంగా కూడా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తన వైవాహిక బంధం ఇచ్చిన కావడం.. అటు ఆరోగ్యపరమైన ఇబ్బందులు నేపథ్యంలో ఆమె ఆధ్యాత్మిక వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తుంది. తాను సంపాదించిన ఆస్తిలలో సగానికి పైగా పలు సేవా స్వచ్చంద సంస్థలకు, ఛారిటీకి డొనేట్ చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో సమంత బంగారం అంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.