సిటాడెల్ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ తో సమంత డేటింగ్ చేస్తుంది అని గత నాలుగైదు రోజుల నుండి బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.అయితే అప్పటివరకు సైలెంట్ గా ఉన్న సమంత ఎప్పుడైతే నాగచైతన్య శోభితను పెళ్లాడబోతున్నారు అనే విషయం బయటపడిందో ఆ తర్వాత రెండు మూడు రోజులకే సోషల్ మీడియాలో డైరెక్టర్ రాజ్ తో కలిసి ఉన్న ఫోటోలు తన పిఆర్ టీం తో వైరల్ చేయించింది.
అయితే అప్పటి వరకు సమంత రాజ్ తో ఉన్న ఫోటోలు ఎక్కడ కూడా దర్శనం ఇవ్వలేదు. కానీ సడన్గా ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో సమంత నిజంగానే ఆయనతో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ జోరందుకున్నాయి. అయితే తాజాగా వీరిద్దరి మధ్య బంధం గురించి మరో సీక్రెట్ బయటపడింది.సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చింది.కానీ రాజ్ కి కూడా పెళ్లయింది అయితే ఆయన తన భార్యకి విడాకులు ఇవ్వలేదు.
ఇక ఎప్పుడైతే సమంతతో డేటింగ్ చేస్తున్నాడో అప్పటినుండి రాజ్ కూడా తన భార్యతో సరిగ్గా కలిసి ఉండటం లేదని, ఆమెకు విడాకులు ఇవ్వాలని చూస్తున్నాడు అని తెలుస్తుంది.అయితే రాజ్ కి విడాకులు ఇవ్వడానికి భార్య ఒప్పుకోకపోవడంతో ఎంత భరణం ఇచ్చైనా సరే తన భార్యను వదిలించుకొని సమంతను రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నట్టు బీటౌన్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.ఒకవేళ రాజ్ తన భార్యకు నిజంగానే విడాకులు ఇస్తే మాత్రం సమంత వారిద్దరిని విడదీసింది అవుతుంది అని కొంతమంది భావిస్తున్నారు.ఒకవేళ విడాకులు అయితే సమంత ఆయనతో రెండవ పెళ్లికి రెడీ అవుతుందని కూడా రూమర్ ప్రచారం చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు.