స్టార్ హీరోయిన్ సమంత ఓ హీరో పక్కన 5 కోట్లు ఇచ్చినా సరే నటించనని కరాకండిగా చెప్పేసిందిట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు నటించను అని చెప్పిందో ఇప్పుడు చూద్దాం.. హీరోయిన్ సమంత 5 కోట్లు ఇచ్చిన కూడా ఆ హీరో తో నటించినని చెప్పింది ఏ హీరోతోనో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో.. స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ బాబు తనయుడుగా ఇండస్ట్రీలోకి అల్లుడు శీను అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈయన ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.
అయితే ఈ హీరోతో జత కట్టడం కోసం ఐదు కోట్ల భారీ పారితోషికం అప్పట్లో ఇస్తానని చెప్పినా కూడా సమంత ఒప్పుకోలేదట. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ మూవీ అల్లుడు శీను సినిమాలో మాత్రం సమంత హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమాలో కూడా మొదట్లో సమంత ఒప్పుకోలేదట. కానీ నిర్మాత సురేష్ బాబు ఇండస్ట్రీలో పేరున్న పెద్దాయన కాబట్టి మళ్ళీ ఆఫర్స్ ఎక్కడ తగ్గిపోతాయోనని కొన్ని కారణాల వల్ల ఒప్పుకోవాల్సి వచ్చిందట.
కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి తన మూవీ మహాసముద్రం కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా అనుకున్నారట.. అయితే హీరోకి తగ్గట్టే హీరోయిన్ కూడా పాపులారిటీ ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలని సమంతని ఫిక్స్ చేశారట. కానీ సమంత మాత్రం రిజెక్ట్ చేసిందట.కానీ డైరెక్టర్ మాత్రం 5 కోట్ల పారితోషికం ఇస్తానని చెప్పారట.అయితే డబ్బు కి ఆశపడి సమంత చేస్తుంది అనుకున్నారు. కానీ ఆమె ఎంత డబ్బు ఇస్తానని చెప్పినా కూడా రిజెక్ట్ చేసిందట.
దానికి కారణం అప్పటికే సమంత స్టార్ హీరోయిన్ హోదాలో ఉంది. ఒకవేళ ఆ సినిమాలో నటిస్తే తన స్టార్ డం పూర్తిగా తగ్గిపోయి స్టార్ హీరోలు తమ సినిమాల్లో తీసుకోరని సమంత భయపడిందట. అంతే కాకుండా ఆర్ఎక్స్ 100 మూవీ సినిమాలో అజయ్ భూపతి పాయల్ రాజ్ పుత్ తో ఓవర్ గ్లామర్ షో చేయించారు. నెక్స్ట్ సినిమాలో కూడా అలాగే గ్లామర్ గా చూపిస్తారు అనే ఉద్దేశంతో సమంత ఈ సినిమాకి నో చెప్పిందట. ఇక మహాసముద్రం సినిమాని అజయ్ భూపతి శర్వానంద్, సిద్ధార్థ్,అదితి రావు హైదరి, అను ఇమ్మానియేల్ లని తీసుకొని తెరకెక్కించారు. అలా ఐదు కోట్లు ఇచ్చినా కూడా సమంత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదని టాక్ అప్పట్లో వినిపించింది.