శోభిత ధూళిపాళ్ల తో నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత అందరి ఫోకస్ సమంత పైనే పడింది. తన మాజీ భర్త కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం పట్ల సమంత ఎలా రియాక్ట్ అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కానీ సమంత మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. తన హెల్త్ మరియు కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా సమంతకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తోందని పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డి.కె.. సమిష్టిగా రాజ్ & డికె అని పిలుస్తారు. దర్శకులుగా, రచయితలుగా మరియు నిర్మాతలుగా వీరిద్దరూ నార్త్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్, హనీ బన్నీ వెబ్ సిరీస్ ల కోసం రాజ్ & డికె లతో కలిసి సమంత వర్క్ చేసింది.
అయితే ఈ క్రమంలోనే రాజ్ తో సమంత ప్రేమలో పడిందని.. గత కొంత కొద్ది రోజుల నుంచి ఇద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతుకున్నాయి. త్వరలోనే ఈ జంట ఎంగ్మేజెంట్ చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. కాగా, రాజ్ కు ఆల్రెడీ శ్యామాలి అనే అమ్మాయితో వివాహం జరిగింది. కానీ ఇప్పుడు సమంత కోసం రాజ్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడని టాక్ నడుస్తోంది. దీనిపై కూడా ఎటువంటి అధికారిక సమాచారం లేదు.