మలయాళ బ్యూటీ సాయి పల్లవి నిజంగానే ఆ పెళ్లయిన వ్యక్తితో రిలేషన్ లో ఉందా.. డేటింగ్ కూడా చేసిందా.. కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అయిన న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. సాయి పల్లవి అందానికే మారుపేరుగా న్యాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాలో నటించినా చాలు ఆ సినిమాలో హీరోని చూడడం మానేసి సాయి పల్లవినే చూస్తూ కూర్చుంటారు చాలామంది జనాలు. అంతలా స్టార్డం సంపాదించింది. ఇక ఇప్పటి జనరేషన్ హీరోయిన్లందరూ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటే ఈమె మాత్రం నిండుగా చీర కట్టుకొని అచ్చ తెలుగు ఆడపిల్లలాగా కనిపిస్తుంది. అంతేకాదు ఈమె చీర కట్టుకు చాలామంది అభిమానులు కూడా ఉన్నారు.ఇక పెద్దపెద్ద స్టార్ సెలబ్రిటీలు కూడా ఈమెకు అభిమానులు అంటే అతిశయోక్తి కాదు.
ఇక సింపుల్ గా నాచురల్ గా ఉండే సాయి పల్లవి యాక్టింగ్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఫిదా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అందర్నీ తన నటనా,అందంతో ఫిదా చేసి పడేసింది. దాంతో మొదటి సినిమాతోనే సాయి పల్లవికి వీరాభిమానులుగా మారిపోయారు. అలా ఇండస్ట్రీలో స్టార్ నటిగా కొనసాగుతోంది ఈ బ్యూటీ. ఇక ఈమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా సాయి పల్లవి నటన బాగాలేదని ఎవ్వరు అనరు. కేవలం కథ మాత్రమే బాలేదు అంటారు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తెలుగు,తమిళ, మలయాళ భాషల్లో నటించింది. ఇక రామాయణం మూవీతో బాలీవుడ్లోకి కూడా అడుగు పెట్టింది.
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఓ కోలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తోందని అప్పట్లో తమిళ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆశ్చర్యం ఏమిటంటే..ఆ హీరోకి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని ప్రచారం జరిగింది. దాంతో కొంతమంది జనాలు సాయి పల్లవికి ఇదేం పోయేకాలం పెళ్లయి పిల్లలున్న హీరోతో డేటింగ్ చేయడం ఏంటి అని తిట్టుకున్నారు.కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ విషయంలో ఎలాంటి నిజం లేదు అని బయటపడింది. అది కేవలం ఇండస్ట్రీలో ప్రచారమైన రూమర్ మాత్రమేనని తెలియడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే కదా అని సాయి పల్లవి కూడా ఈ రూమర్ పై స్పందించలేదట.