ఐదేళ్ల తర్వాత హరీష్ శంకర్ సినిమా వస్తుంది అంటే హీరో ఎవరు ? అన్నది పక్కన పెట్టేసి టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడతాయి. అందులోనూ మాస్ మహారాజ్ రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మిరపకాయ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో అంచనాలు మామూలుగా లేవు. ఆగస్టు 15 కానుకగా మూడు సినిమాల మధ్యలో పోటీగా మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ అయింది. రు. 295లతో రిక్లెయినర్ టిక్కెట్ కొనుక్కుని మొత్తం 400 రూపాయలు ఖర్చు అయింది. నేను కొన్న టిక్కెట్టు రేటులో సగానికి కూడా ఈ సినిమా న్యాయం చేయలేదని చెప్పాలి. బాలీవుడ్ లో హిట్ అయిన రైడ్ సినిమాను రీమేక్ చేయాలని అనుకున్నాడు.
వాస్తవంగా చూస్తే ఇలాంటి కథలు తెలుగులో ఎన్నో చూసేసి ఉన్నాం. ఇది 1990ల నాటి కథ. విచిత్రం ఏంటంటే సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి పాటల పిచ్చి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కరి పాటలకు అభిమానులుగా ఉంటారు. చివరికి విలన్ జగపతిబాబు కూడా తాయారమ్మ అని పాట పాడుకుంటూ ఉంటాడు. సినిమా ఫస్ట్ ఆఫ్ కామెడీగా కాస్త పరవాలేదు అనిపించింది. బాలీవుడ్ లో ఫస్ట్ స్టాప్ లో భార్యాభర్తల మధ్య అనుబంధంతో కథ నడుస్తుంది. ఇక్కడ అది వర్కౌట్ కాదనుకొని ప్రేమ కథను నడిపించాడు. ప్రేమకథతో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ అందంగా ఉండడం పాటలు కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండడంతో పర్వాలేదు అనిపించింది.
ఇంటర్వెల్ నుంచి కథ సీరియస్ గా మారుతుంది. ఇక సెకండాఫ్ మొదలయ్యాక కథ ఒక పట్టాన ముందుకు సాగదు. విలన్ జగపతిబాబు ఇంట్లోనే కథ అంతా నడుస్తూ ఉంటుంది. విలన్ పాత్ర పెద్ద తోపులా ప్రారంభమై కాసేపటికి తోక ఊపుకుంటూ.. తోకముడుస్తూ ఉంటాడు. అరువు తెచ్చుకున్న కథని దర్శికుడు హరీష్ శంకర్ బరువుగా మార్చుకుని పూర్తిగా చేతులు ఎత్తేశాడు. అసలు ఈ కథను ఏ జానర్లో చెప్పాలో తెలియక కొంచెం కామెడీ.. కొంచెం ప్రేమ కథ… కొంచెం సీరియస్‌నెస్ కలిపి కలగాపులగం చేసి పడేసాడు. థియేటర్లలో సినిమా చూస్తోన్న ప్రేక్షకుడికి సూదులతో గుచ్చెన్ అనిపించాడు. ఏది ఏమైనా హరీశంకర్ అవుట్ డేటెడ్ కి … అప్డేట్ కి మధ్యలో ఉన్నాడు. వచ్చే సినిమాతో అయినా అప్డేట్ కాకపోతే ఇక అవుట్ డేటెడ్ లిస్టులోకి వచ్చేస్తాడు.