రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్… స్కంధ లాంటి ప్లాప్ సినిమా తర్వాత హీరో రామ్ పోతినేని కలిసి చేసిన సినిమా ఇది. అటు హీరో.. ఇటు డైరెక్టర్ ఇద్దరు డిజాస్టర్ లలో ఉన్నా కూడా ఈ సినిమాకు ఇంత బజ్ రావడానికి ఇస్మార్ట్ శంకర్ విజయం ప్రధాన కారణం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాకు పోటీగా రిలీజ్ అయిన డబుల్ ఇస్మార్ట్ కు ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్లు పడ్డాయి. అయితే అదే టైంలో రెండు తెలుగు రాష్ట్రాలలో రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాకు ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యాయి.
రవితేజ సినిమాకు నెగిటివ్ టాక్ ఎక్కువగా వస్తోంది. దీంతో డబుల్ ఇస్మార్ట్ కు కాస్త ఎడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ట్రెండింగ్ ప్రకారం చూస్తే సినిమాలో రామ్ ఎనర్జీ గురించి బాగా చెబుతున్నారు.. ఎనర్జీ అంటే రామ్.. రామ్ అంటే ఎనర్జీ అని.. ఇస్మార్ట్ శంకర్ పాత్రను మరోసారి పోషించిన తీరు అద్భుతంగా ఉందని అంటున్నారు. ఫస్టాప్ యావరేజ్ అని… సెకండ్ ఆఫ్ ఎబో యావరేజ్ అని కొందరు చెబుతున్నారు. రామ్ మాస్ యాక్షన్ అదిరిపోయింది అని కామెంట్ చేస్తున్నారు.
కథ కాస్త రొటీన్ గాని అనిపించినా కూడా ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఎలాంటి అంశాలు ఆడియన్స్ కోరుకుంటారో అలాంటి అంశాలు ఇందులో కూడా ఉన్నాయని.. అందుకే మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుందని అంటున్నారు. ఓవరాల్ గా ప్రీమియర్స్ కంప్లీట్ టైంకి సినిమా పర్వాలేదు అనిపించే టాక్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ యావరేజ్ గా ఉంటే సెకండ్ హాఫ్ యావరేజ్ టు ఎవో యావరేజ్ లెవెల్ లో ఉందని ఓవరాల్ గా సినిమా యావరేజ్ దగ్గరగా ఉండొచ్చు అని అంటున్నారు.
అయితే చాలా మంది నెటిజన్లు మాత్రం డబుల్ ఇస్మార్ట్ అనేది కంప్లీట్ రొటీన్, ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ అని… పూరి జగన్నాథ్ టేకింగ్‌లోనూ కొత్తదనం కనిపించలేదంటున్నారు. హీరో క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్న డ్రామా చాలా ఆర్టిఫీషియల్‌గా ఉందని టాక్ ? అలీ క్రింజ్ కామెడీని భరించడం కష్టమేనని అంటున్నారు. చిప్ కాన్సెప్ట్ అనే ఐడియా బాగున్నా ఎక్కడ లాజిక్స్ కనిపించవని అంటున్నారు. సంజయ్ దత్ పాత్ర కూడా లాజిక్ లెస్‌గా సాగుతుందట. ఓవరాల్‌గా రామ్ నటన మినహాయిస్తే డబుల్ ఇస్మార్ట్ టాక్ కూడా ఏం గొప్పగా లేదు.