Moviesపూరి రాడ్ దింపాడు… హ‌రీష్ మేకు గుచ్చేశాడు… మీకు మీ సినిమాల‌కు...

పూరి రాడ్ దింపాడు… హ‌రీష్ మేకు గుచ్చేశాడు… మీకు మీ సినిమాల‌కు దండం బాబు…?

ఇద్దరూ గురు శిష్యులు చాలా రోజుల తర్వాత సినిమాలు చేశారు.. రెండు సినిమాలు భార ఈఅంచనాలతో ఆగస్టు 15 కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పైగా తెలుగులో కల్కి తర్వాత మంచి సినిమా లేదు. ఓ మంచి సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టి మరి చూడాలని అనుకుంటున్నారు. ఆగస్టు 15 కానుకగా మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ బచ్చన్ – పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ – నార్నే నితిన్.. గీతా కాంపౌండ్ కాంబినేషన్లో వచ్చిన ఆయ్, విక్రమ్ సినిమా తంగలాన్… ఈ నాలుగు సినిమాలలో మిస్టర్ బచ్చన్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. తొలిరోజు థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు ఈ రెండు సినిమాలతో హరీష్ శంకర్ – పూరి జగన్నాథ్ ఇద్దరు చుక్కలు చూపించేశారు. అసలు ఈ రెండు సినిమాలు ఎందుకు తీసారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి.

హిందీలో హిట్ అయిన రైడ్ సినిమాను రీమేక్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల మెచ్చేలా తెరకెక్కించానని హరీశంకర్ ముందు నుంచి కబుర్లు చెబుతూ వచ్చాడు. హరీష్‌ శంకర్ మాటలు చూస్తుంటే కోటలు దాటిపోతూ ఉంటాయి.. కానీ ఈ సినిమాను చూస్తే ఎప్పుడో 15 సంవత్సరాలు క్రితం టేకింగ్ తో తీసినట్టుగా అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ ఆఫ్ అంత కామెడీగా తీసి.. సెకండ్ హాఫ్ లో సిరీయ‌స్ డ్రామాతో హీరోయిజాన్ని తారాస్థాయికి తీసుకువెళ్తాడు.. అనుకుంటే మొత్తం కలగా పులగం చేసేసాడు. జగపతిబాబు లాంటి బలమైన క్యారెక్టర్ ను విలన్ గా పెట్టి ఏమాత్రం సీరియస్‌ లేకుండా చేశాడు.

ఫస్టాఫ్‌లో హీరో.. హీరోయిన్ల మధ్య ప్రేమ కథతో కొంతవరకైనా భరించిన ప్రేక్షకుడు ఇంటర్వెల్‌ తర్వాత ఎప్పుడు థియేటర్ల నుంచి బయటకు వెళదామా ? అన్నట్టుగా భరిస్తూ థియేటర్లలో మిస్టర్ బచ్చన్ సినిమా చూశారు. విచిత్రం ఏంటంటే ? హీరో క్యారెక్టర్ ముఖ్యమంత్రి.. ప్రధానమంత్రి కి నేరుగా ఫోన్ చేసిన కూడా డోంట్ కేర్ అంటూ వాళ్ళకే పంచ్ డైలాగ్ లు కొడుతూ ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే హరీశంకర్ అసలు ఈ కాలంలో ఉన్నాడా ? అన్న సందేహాలు కూడా కలుగుతాయి. ఏదిఏమైనా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ అంటూ రీమేక్‌తో ప్రేక్షకుల మనసులను సూదులతో గుచ్చెన్ అన్నట్టుగా చుట్టిపడేశాడు.

వరుస ప్లాపులు తర్వాత ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ సినిమా తీసిన పూరి జగన్నాథ్ ఆ వెంటనే విజయ్ దేవరకొండ తో లైగర్ లాంటి పెద్ద డిజాస్టర్ సినిమా తీశాడు. ఇక ఈ సినిమాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసినట్టు ముందే చెప్పాడు. అయితే మిస్టర్ బచ్చన్ తో పోలిస్తే డబ్బులు ఇస్మార్ట్ కథ‌ కాస్త కొత్తగా ఉంటుంది. విలన్ మెదడు నుంచి చిప్ ద్వారా హీరో మెదడులోకి డేటా ట్రాన్స్ఫర్ అనేది కొత్తగా అనిపిస్తుంది. స్టోరీ లైన్ వింటే ఏదో హాలీవుడ్ కథ‌లా అనిపిస్తుంది.

కానీ చాలా రొటీన్ కథనంతో ఎక్కడా కొత్తదనం లేకుండా చెప్పుకుంటూ వెళ్లిపోయాడు.. దర్శకుడు సినిమాలో చెప్పుకోవడానికి ఒక్క గుస్‌బంప్స్ మూమెంట్స్ లేవు పూరి జగన్నాథ్ సినిమాలు అంటే కథలో కథనంలో గ్రిప్ మాటల్లో లాజిక్ ఉంటుంది.. కానీ ఈ సినిమాలో పాటలు తప్ప అన్ని తేలిపోయాయి. ఒక సాదాసీదా రెవెంజ్ డ్రామాని శంకర్ పాత్ర‌కు తగిలించి… పైగా ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్ అంటూ లాగించేశాడు. ఫైనల్ గా పూరి తీసిన డిజాస్టర్ లైగ‌ర్ సినిమా కంటే కాస్త బెటర్ అయినా పూరి నుంచి ప్రేక్షకులు ఆశించే సినిమా ఎంత మాత్రం ఇది కాదు.. ఒకే ఫోన్లో రెండు సిమ్ కార్డులు ఉన్న సిగ్నల్ వీక్ అని చెప్పుకోవాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news