Moviesనోరు జారిన ప్రియాంక మోహన్.. బూతులు తిడుతున్న ఫ్యాన్స్‌..!

నోరు జారిన ప్రియాంక మోహన్.. బూతులు తిడుతున్న ఫ్యాన్స్‌..!

సినీ తార‌లు మాట్లాడేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడాలి. పొర‌పాటున నోరు జారారో అడ్డంగా బుక్క‌వ‌డం ఖాయం. ప్ర‌ముఖ హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ విష‌యంలోనూ ఇప్పుడిదే జ‌రిగింది. బెంగ‌ళూరులో పుట్టి పెరిగిన ప్రియాంక మోహ‌న్‌.. నాని గ్యాంగ్ లీడర్ మూవీతో తెలుగు వారికి చేరువైంది. అలాగే డాక్టర్, డాన్, ఈతర్క్కుమ్ తునింధవన్ చిత్రాల‌తో కోలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుంది.

త్వ‌ర‌లోనే సరిపోధా శనివారం చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించేందుకు ప్రియాంక సిద్ధ‌మైంది. వివేక్ ఆత్రేయ తెర‌కెక్కించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో నాని హీరోగా.. ద‌ర్శ‌క‌న‌టుడు ఎస్‌.జె. సూర్య విల‌న్ గా న‌టించారు. ఆగ‌స్టు 29న వ‌ర‌ల్డ్ వైడ్ గా స‌రిపోదా శ‌నివారం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ఇటీవ‌ల హైద‌రాబాద్ లో జ‌రిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రియాంక ఎస్‌.జె. సూర్యను ఉద్ధేశిస్తూ కొన్ని కామెంట్స్ చేసింది.

అందరి తరఫున నేను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా. మళ్లీ ఎప్పుడు దర్శకత్వం చేస్తారు. మేం ఖుషి 2 సినిమాను ఆశించవచ్చా. ఖుషి 2 సినిమా చేస్తే ఖ‌చ్చితంగా పవన్ కల్యాణ్‍తోనే చేయండి అంటూ ప్రియాంక వ్యాఖ్యానించింది. ఆమె కామెంట్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. కానీ కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ అభిమానులు మాత్రం బాగా హ‌ట్ అయ్యారు.

ఎందుకంటే త‌మిళంలో విజ‌య్‌, జ్యోతిక జంట‌గా న‌టించిన ఖుషి మూవీనే సేమ్ టైటిల్ తో తెలుగులో రీమేక్ చేశారు. కాబ‌ట్టి ఖుషి 2 తీస్తే తమిళంలో విజయ్ తో తీయాలి కానీ.. తెలుగులో పవన్ కళ్యాణ్ తో తీయమని ప్రియాంక అడగడం విడ్డూరంగా ఉందంటూ ద‌ళ‌ప‌తి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోష‌ల్ మీడియాలో ప్రియాంక‌ను బూతులు తిడుతున్నారు. టాలీవుడ్ లో ఆఫ‌ర్ల కోస‌మే ప్రియాంక ఇలా మాట్లాడుతుంద‌ని ఏకేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news