స్టార్ హీరో ప్రభాస్ తాజాగా కేరళకు భారీ సహాయం చేసి తన మంచి మనసుని చాటుకున్నాడు. అయితే ప్రభాస్ కేరళకు చేసిన సహాయం వల్ల ఆయన పేరు బయటకు వచ్చింది. కానీ ఆయన మీడియాకు తెలియకుండా గుప్తదానాలు ఎన్నో చేస్తారట. తాజాగా ఆయన ప్రతి ఏటా వందమంది పిల్లలని ఫ్రీగా ఎలాంటి ఖర్చు లేకుండా చదివిపిస్తారనే విషయం బయటపడింది.వారికి తిండి నుండి బట్టల వరకు ప్రతి ఒక్కటి ఈయన చూసుకుంటారట. అలా ప్రతి సంవత్సరం 100 మందికి మంచి భవిష్యత్తుని ఇస్తున్నారు. అలా ప్రభాస్ కేవలం సినిమాల ద్వారానే కాదు తన వంతుగా సమాజానికి సహాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. అయితే అలాంటి ఈ గొప్ప హీరో ఇప్పటివరకు పెళ్లయితే చేసుకోలేదు.
కానీ.. ప్రభాస్ లవ్ మీద రూమర్స్ కి కొదువేమీ లేదు. ఒకప్పుడు త్రిష తో ఈయన సాన్నిహిత్యంగా ఉండేవారు. ఆ తర్వాత అనుష్క వచ్చి చేరింది. ప్రస్తుతం అనుష్క ప్రభాస్ ల మధ్య రిలేషన్ ఉందని టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల టాక్.అయితే అలాంటి ఈ హీరో తన లవర్ ముందే మరో హీరోయిన్ తో రొమాన్స్ చేయవలసి వచ్చిందట. మరి ఆ హీరోయిన్ ఎవరు ఆ సినిమా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రభాస్ హీరోగా చేసిన బిల్లా సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో ప్రభాస్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ గా ఉన్న అనుష్క శెట్టి అలాగే హీరోయిన్ నమితలు నటించారు. అయితే హీరోయిన్ నమితను ఈ సినిమాలో తీసుకోవడం ప్రభాస్ కి ఇష్టం లేదట.కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నమిత ని తీసుకోవాల్సి వచ్చిందట.ఇక ఈ సినిమాల్లో కొన్ని కొన్ని సన్నివేశాలలో నమితతో రొమాన్స్ చేసే సమయంలో చాలా ఇబ్బంది పడిపోయేవారట.
ఎందుకంటే ఓపక్క ప్రభాస్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ అనుష్క ఉండడంతో నమిత తో రొమాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడేవారట. ఇక అప్పట్లో అసలు నమితను ప్రభాస్ తన సినిమాలో ఇష్టం లేకుండానే తీసుకున్నారని, అది కేవలం కృష్ణంరాజు చెప్పడం వల్లే ఆ హీరోయిన్ తో నటించారనే టాక్ కూడా వినిపించింది. అలా ప్రభాస్ తన లవర్ అనుష్క ముందే నమితతో రొమాన్స్ చేయడం అప్పట్లో చాలా వైరల్ అయింది. అయితే ఈ విషయం బిల్లా సినిమా సమయంలో ఎక్కువగా వినిపించింది. అయితే ఆ మేటర్ మరోసారి నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ప్రభాస్ గురించి ఫన్నీగా కామెంట్లు పెడుతూ నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు భయ్యా అంటూ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.