ప్రభాస్ కొత్త సినిమా ఈరోజు ప్రారంభమైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీస్ వాళ్ళు నిర్మించే ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఈ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ప్రభాస్ కు జోడిగా ఇమాన్వి అనే కొత్త అమ్మాయిని తీసుకున్నారు. హను రాఘవపూడి హీరోయిన్ సెలక్షన్ ఎప్పుడూ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కథకు తగ్గట్టుగానే హను హీరోయిన్లను ఎంపిక చేసుకుంటాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సీతారామం సినిమా కోసం మృణాల్ ఠాగూర్ ఎంపిక అని చెప్పాలి.
ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం ఇమాన్వీని తీసుకున్నాడు. ఇమాన్వీకి చాలా భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆమెకు లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు.. ఆమె గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ది బెస్ట్ డాన్సర్… ఇన్‌స్టాగ్రామ్ – యూట్యూబ్లో ఆమెకు లక్షల్లో అభిమానులు ఉన్నారు. క్లాసికల్ నుంచి వెస్ట్రన్ వరకు ఏ తరహా డ్యాన్స్ అయినా చాలా సింపుల్ గా పెర్ఫార్మ్ చేయటంలో ఆమె టాప్. ఇలాంటి అమ్మాయిని ప్రభాస్ సినిమా కోసం హీరోయిన్గా తీసుకున్నాడు.. అంటే అందులో కచ్చితంగా డాన్స్ కు సంబంధించిన అంశాలు ఉంటాయని అంతా భావిస్తున్నారు.
ఇది పీరియాడిక్ సినిమా… స్వతంత్రానికి ముందే జరిగిన కథతో వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ఇందులో క్లాసికల్ డ్యాన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి అని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఈమెను మెయిన్ హీరోయిన్ పాత్ర కోసం తీసుకున్నారా ? లేదా మరేదైనా కీలకపాత్ర కోసం తీసుకున్నారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇతర కీలకపాత్రల కోసం బాలీవుడ్ సీనియర్ హీరో మిథిన్ చక్రవర్తి.. సీనియర్ హీరోయిన్ జయప్రద లాంటి సీనియర్లను తీసుకున్నారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమా కోసం ఫౌజీ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.