Moviesప్రేమ పేరుతో ఒక‌రిని వాడుకుని.. డ‌బ్బు కోసం మ‌రో వ్య‌క్తిని పెళ్లాడిన...

ప్రేమ పేరుతో ఒక‌రిని వాడుకుని.. డ‌బ్బు కోసం మ‌రో వ్య‌క్తిని పెళ్లాడిన ప‌వ‌న్ హీరోయిన్‌..?

మీరాజాస్మిన్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గుడుంబా శంకర్, భద్ర, మా ఆయన చంటి పిల్లాడు, గోరింటాకు, మహారథి వంటి సినిమాల ద్వారా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మీరాజాస్మిన్ కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా మలయాళ, తమిళ సినిమాల్లో కూడా నటిగా రాణించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ అప్పట్లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ,శివాజీ, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించింది. ఇక హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో అనిల్ జాన్ టైటస్ అనే దుబాయ్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లాడింది.అయితే అప్పటివరకు ఈమె పెళ్లి అందరూ సంగీత విధ్వంసుడు రాజేష్ మాండలీన్ తో అని అనుకున్నారు.

కానీ ఇంతలోనే అందరికీ పెద్ద ట్విస్ట్ ఇచ్చి కోటీశ్వరుడైన అనిల్ జాన్ టైటస్ ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అయితే మీరాజాస్మిన్ ప్రముఖ సంగీత విద్వాంసుడు అయినటువంటి రాజేష్ మాండలిన్ తో ప్రేమలో ఉండి చాలా సంవత్సరాలు లివింగ్ రిలేషన్ లో ఉంది అని కూడా టాలీవుడ్ లో వార్తలు వినిపించాయి.ఇక ఈ వార్తలను మీరాజాస్మిన్ కూడా ఏనాడు ఖండించలేదు. దాంతో వీరి బంధం చాలా వరకు వెళ్ళింది. కానీ మీరా జాస్మిన్ ఉన్నట్టుండి రాత్రికి రాత్రే ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఏమో తెలియదు కానీ ఆమె దుబాయ్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడంతో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయారు.

2014 జూన్ 10న అనిల్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న మీరా జాస్మిన్ జూన్ 12న అంటే పెళ్లైన రెండు రోజుల తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అయితే మీరాజాస్మిన్ అనిల్ ని పెళ్లి చేసుకున్న సమయంలో ప్రేమ పేరుతో రాజేష్ మాండలిన్ ని మోసం చేసి చివరికి డబ్బున్నవాడని అనిల్ ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అని చాలామంది ఈమెని విమర్శించారు. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ భర్తకు విడాకులు ఇచ్చింది అనే రూమర్ వినిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news