Moviesఎన్టీఆర్ బావమరిది నితిన్ సక్సెస్ సీక్రెట్ బయటపడిందిగా..!

ఎన్టీఆర్ బావమరిది నితిన్ సక్సెస్ సీక్రెట్ బయటపడిందిగా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్ని నితిన్ కెరీర్ ప్రారంభంలోనే వరుసగా రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఎన్టీఆర్ బావమరిదిగా సినిమా రంగంలోకి వచ్చిన నితిన్.. మ్యాడ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. మ్యాడ్‌ తర్వాత అతడికి మాస్ యాక్షన్ కథ‌లంటూ చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ.. వాటన్నింటిని పక్కనపెట్టి కేవలం కథ మీద నమ్మకంతో ఆయ్ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. ఇప్పుడు అదే మంచి ఫలితాన్ని ఇచ్చింది.

ఆగస్టు 15 కానుకగా రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ ఇస్మార్ట్ శంకర్, విక్రమ్ తంగలాన్ సినిమాలకు పోటీగా వచ్చిన చిన్న సినిమా ఆయ్‌కు అదిరిపోయే టాక్‌ వచ్చింది. ఈ సినిమా నితిన్‌కు అన్ని విధాల చాలా ప్లస్ అయింది. తొలి సినిమా కంటే నటనలో.. ధ్యాన్సుల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేశాడు. క్లైమాక్స్ తో చాలా ఈజ్‌తో నటించాడు. కెరీర్ ప్రారంభంలోనే రెండు వరుస సూపర్ హిట్లు రావ‌టం అంటే మామూలు విషయం కాదు. అతడికి ఇది మంచి ఆరంభం అని చెప్పాలి.

ఇక ఎన్టీఆర్ అభిమానుల మద్దతు కూడా ఉంది. ఇప్పుడు మ్యాడ్ 2 సెట్స్ మీద ఉంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మూడో సినిమా విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉంటే నితిన్ కు తిరుగు ఉండదు. సోలో హీరోగానో లేదా.. ఇద్దరు ముగ్గురు హీరోలతో కలిసి చిన్న చిన్న మల్టీస్టారర్ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళితే కచ్చితంగా మిడ్ రేంజ్‌ హీరో స్థాయికి నితిన్ త్వరగా ఎదిగిపోతాడని చెప్పాలి. నిర్మాతలు, దర్శకులు నితిన్‌తో సినిమా చేసేందుకు.. క్యూలో ఉన్నా కూడా నితిన్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కథ‌ల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కథ‌ల విషయంలో తడబడటం లేదు. ఇదే అతడు సక్సెస్ సీక్రెట్ అని చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news