సినిమా ఇండస్ట్రీలో ఎంతోమందిపై ఇప్పటికే దారుణమైన రూమర్లు వినిపించాయి. చాలామంది డేటింగ్ విషయంలో, ప్రేమ విషయంలో ఎన్నో దారుణమైన రూమర్స్ మనం విన్నాం. అయితే ఓ హీరోయిన్ స్టార్ హీరోని సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ఐదు కోట్ల ఇల్లును గిఫ్ట్ గా తీసుకుంది అని అప్పట్లో ఓ రూమర్ మీడియాని కుదిపేసింది.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు నాగార్జున హీరోగా చేసిన శివమణి మూవీలో హీరోయిన్ గా నటించిన అసిన్.. మలయాళీ బ్యూటీ అసిన్ కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా రాణించింది.ఇక తెలుగులో ఆఫర్స్ తగ్గాక బాలీవుడ్ లో స్టార్ నటిగా కొనసాగింది.
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తెలుగులో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఘర్షణ, శివమణి,చక్రం,గజిని, దశావతారం, అన్నవరం వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించింది. అయితే అలాంటి అసిన్ దాదాపు 8 భాషల్లో అనర్గలంగా మాట్లాడగలదు. అలాగే తనకు తానే డబ్బింగ్ చెప్పుకొని అప్పట్లో సెన్సేషనల్ అయింది. అయితే ఈ హీరోయిన్ సౌత్ ఇండస్ట్రీ తర్వాత నార్త్ లో రాణించిన సమయంలో ఓ హీరోతో అసిన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుని 5 కోట్ల ఇల్లును గిఫ్టుగా తీసుకున్నట్టు రూమర్స్ వినిపించాయి. అయితే ఆ హీరో ఎవరో కాదు సల్మాన్ ఖాన్..
సల్మాన్ ఖాన్ ని అసిన్ ని రహస్య వివాహం చేసుకొని ఒక పెద్ద ఇల్లుని గిఫ్టుగా తీసుకున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తల గురించి ఓసారి అసిన్ క్లారిటీ ఇస్తూ నేను ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సమయంలో నాపై ఈ పుకారు వచ్చింది. దాంతో వెంటనే ఈ రూమర్ పై స్పందించి నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు. ఎవరి దగ్గర ఇల్లు గిఫ్ట్ గా తీసుకోలేదు అని అసిన్ క్లారిటీ ఇచ్చింది.అయితే ఈ రూమర్స్ బాలీవుడ్ లో వినిపించాక సల్మాన్ ఖాన్ ఓ రోజు ఫన్నీగా ఇల్లు ఎలా ఉంది అని అన్నారట.
దాంతో ఈ మ్యాటర్ మరింత వైరల్ అయ్యి సల్మాన్ ఖాన్ నిజంగానే అసిన్ మీద ప్రేమతో ఆమెకు 5 కోట్ల ఇల్లును బహుమతిగా ఇచ్చారు అనే రూమర్ బీటౌన్ లో సెన్సేషన్ సృష్టించింది. దాంతో ఈ రూమర్ పై అసిన్ వెంటనే క్లారిటీ ఇచ్చి నాకు సల్మాన్ ఖాన్ మంచి ఫ్రెండ్ అంటూ ఆ వార్తలకు పులిస్టాప్ పెట్టింది.ఇక అసిన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అసిన్ 2016లో మైక్రోమ్యాక్స్ కో ఫౌండర్ అయిన రాహుల్ శర్మని పెళ్లాడింది. ఈ జంటకు ఒక పాప కూడా ఉంది.