Moviesనాగ‌చైత‌న్య - శోభిత కూడా విడిపోతారు.. ఆమె వ‌ల్లే వీరి లైఫ్‌లో...

నాగ‌చైత‌న్య – శోభిత కూడా విడిపోతారు.. ఆమె వ‌ల్లే వీరి లైఫ్‌లో చిచ్చు.. వేణుస్వామి సంచ‌ల‌న జాత‌కం


ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రాజకీయ నాయకులు.. సినిమా సెలబ్రిటీల జాతకాలు చెప్పి సంచలనం క్రియేట్ చేస్తూ ఉంటారు. నాగచైతన్య – స్టార్ హీరోయిన్‌ సమంత ఎంగేజ్మెంట్ సమయంలోనే వీరిద్దరి బంధం ఎక్కువ కాలం నిలబడదు అని… వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోతారని చెప్పి సోషల్ మీడియాని షేక్ చేశారు. అప్పుడు వేణు స్వామిపై అందరూ తీవ్రమైన విమర్శలు చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకే ఈ జంట నిజంగానే విడాకులు తీసుకోవడంతో వేణుస్వామి మాటలు అందరూ నమ్మడం మొదలుపెట్టారు. వేణు స్వామి సినిమా రంగంలోనూ .. సోషల్ మీడియాలను ఒక సెలబ్రిటీ.

అయితే ఇటీవల ఏపీ ఎన్నికలలో జగన్ గెలుస్తారని చెప్పినా ఊహించిన విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వేణుస్వామి పై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీంతో తాను జాతకాలు చెప్పానని కూడా వేణుస్వామి అధికారికంగా ప్రకటించారు. అప్పటినుంచి వేణు స్వామి సెలబ్రిటీల జాతకాలు చెప్పటం లేదు.. అయితే తాజాగా నాగచైతన్య – శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎంగేజ్మెంట్ పై ఈరోజు తాను వారిద్దరి జాతకలపై విశ్లేషణ చేస్తానని వేణుస్వామి నిన్న పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే.

ఈరోజు నాగచైతన్య – శోభిత జాతకాలు చూసినా వేణుస్వామి ఓ సంచలన వీడియో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం గురించి మాట్లాడుకుందాం అంటూ వైవాహిక జీవితానికి సంబంధించి నాగర్జున ఎంగేజ్మెంట్‌కు నిషేధం ముహూర్తాన్ని ఎంచుకున్నారని ఎనిమిదో నెల 8వ తేదీ 2024 కాబట్టి ముహూర్తం బలంగా ఉందని పెట్టుకున్నారు కావచ్చు.. అయితే నిశ్చితార్థంకు పనికిరాని ముహూర్తంలో వీమీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు… సమంతది మేషరాశి… శోభితది ధనుస్సు రాశి.. ఆమె కూడా అమావాస్యనాడు పుట్టింది.. ఈ క్రమంలోనే నాగచైతన్య – సమంత పెళ్ళికి ముందే విడాకులు తీసుకున్నార‌ని స్వామి గుర్తు చేశారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు శోభిత – చైతు జాతకాల విశ్లేషణ చేశాను.. నేను అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను.. కానీ శోభిత్ జాతకం వల్ల 2027 నుంచి వీరి వైవాహిక బంధం లో కలతలు… సమస్యలు ఏర్పడతాయని.. ఆ తర్వాత గొడవలు పెరుగుతాయని… వీరిద్దరి మధ్య గొడవలకు ఓ స్త్రీ కారణం అవుతుందని.. నాగచైతన్య – శోభిత జాతకాలు కలవలేదు.. నిశ్చితార్థానికి పెట్టిన ముహూర్తం కూడా మంచిది కాదు.. నేను అఖిల విషయంలో కూడా ఇలాగే చెప్పాను.. ఇప్పుడు కూడా ఒక జ్యోతిష్యుడుగా మంచి కోసం చెబుతున్నాను.. నా జాతకం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నాను… కానీ వారి జాతకాలు బాగోలేదని వేణుస్వామి కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.

ఇక ఫైన‌ల్‌గా నాగచైతన్య – శోభిత విడిపోతారు అని వేణుస్వామి చెప్పేశారు. ఇక సమంత – నాగచైతన్యకు 50 మార్కులు అయినా వేస్తా కానీ.. శోభిత‌కు మాత్రం పది మార్కులు కూడా వేయలేను.. ఎందుకంటే కెరీర్ పరంగా సామ్ జాతకం బాగుంది.. కానీ శోభిత‌ది బాగోలేదు.. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వీరిద్దరి మధ్య ఎడబాటు తప్పదు అని వేణు స్వామి చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news