యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధం అయిన సంగతి తెలిసిందే. మొదట సమంతను నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2017లో వీరి వివాహం జరగగా.. 2021లో విడాకులతో తమ బంధాన్ని ముగించారు. ఆ తర్వాత నాగచైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తో ప్రేమలో పడ్డాడు. దాదాపు రెండేళ్ల నుంచి సీక్రెట్ రిలేషన్ లో ఉన్న ఈ జంట త్వరలోనే వైఫ్ అండ్ హస్బెండ్ గా ప్రమోట్ కాబోతున్నారు.
ఆగస్టు 8న నాగార్జున నివాసంలో నాగచైతన్య శోభితల నిశ్చితార్థం వేడుక జరిగింది. అయితే నిశ్చితార్థం తర్వాత నాగచైతన్య తొలిసారి తన పెళ్లి గురించి నోరు విప్పాడు. తాజాగా ఓ వెడ్డింగ్ బ్రాండ్ ప్రమోషన్స్ కు హాజరైన నాగచైతన్యకు మీడియా మిత్రుల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. శోభితను ఎప్పుడు ఎక్కడ పెళ్లి చేసుకోబోతున్నారు..? సింపుల్ గానా లేక గ్రాండ్ గా ఉంటుందా..? అంటూ ప్రశ్నించారు.
అందుకు నాగ చైతన్య బదులిస్తూ.. పెళ్లి అంటే నా మనసుకు నచ్చిన వాళ్లంతా కచ్చితంగా ఉండాలి. గ్రాండ్ గా చేసుకోవాలని కాదు కానీ.. సాంప్రదాయం ప్రకారం అందరి సమక్షంలో పెళ్లి జరగాలి. అదే నేను కోరుకుంటున్నాను. ఇక పెళ్లి ఎప్పుడు ఎక్కడ అనే వివరాలు త్వరలోనే చెబుతాను అంటూ పేర్కొన్నాడు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక ఇటీవల నాగార్జునకు చెందిన ప్రాపర్టీ ఎన్-కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ప్రశ్నించగా.. దాని గురించి ఇప్పుడు ఎందుకంటూ నాగ చైతన్య మాట దాటవేశాడు. ఎన్-కన్వెన్షన్ కూల్చివేతపై ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. కాగా నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నాడు. యథార్థ ఘటనల ఆధారంగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మత్స్యకార యువకుడిగా నాగచైతన్య నటిస్తుండగా.. సాయి పల్లవి అతనికి జోడిగా చేస్తోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తండేల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.