MoviesTL రివ్యూ : మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ … పెద్ద దెబ్బ ప‌డిందిగా…

TL రివ్యూ : మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ … పెద్ద దెబ్బ ప‌డిందిగా…

టైటిల్ : మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌
న‌టీన‌టులు: ర‌వితేజ‌, భాగ్య శ్రీ, జ‌గ‌ప‌తిబాబు, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ త‌దిత‌రులు
సంగీతం: మిక్కీ జే మేయ‌ర్‌
నిర్మాత‌: టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం: హ‌రీష్ శంక‌ర్‌
రిలీజ్ డేట్ : 15 ఆగ‌స్టు, 2024

ప‌రిచ‌యం :
చాలా రోజుల తర్వాత తెలుగులో ఒకేరోజు మూడు మంచి అంచనాలు ఉన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ బచ్చన్ – పూరి జగన్నాథ్ – రామ్ కాంబినేషన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ – విక్రమ్ – పా రంజిత్ కాంబినేషన్లో వచ్చిన తంగ‌లాన్ సినిమాలు ఈరోజు రిలీజ్ అయ్యాయి. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా టీజర్.. ట్రైలర్లతో ఆకట్టుకుంది. పాటలో హీరోయిన్ భాగ్యశ్రీ అంద‌చందాలు ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు దీనిపై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో ? సమీక్షలో చూద్దాం.

స్టోరీ :
నిజాయితీ కల ఆదాయపు పన్ను శాఖ అధికారి బచ్చన్ ( రవితేజ ) నమ్మిన విలువల కోసం అవసరమైతే దేశ ప్రధానికి కూడా ఎదురు చెప్పేందుకు వెనుకాడడు. ఈ క్రమంలోనే ఒక వ్యాపారిపై రైడ్ చేసి భారీ మొత్తంలో నల్లధనం పట్టుకుంటాడు. బచ్చన్ వెంటనే పై అధికారులు అతడిని సస్పెండ్ చేస్తారు. దీంతో సొంతూరికి వెళ్లిపోయి అక్కడ ఆర్కెస్ట్రా ట్రూప్ పెట్టుకుని న‌డుపుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే జిక్కి ( భాగ్యశ్రీ ) ని చూసి మనసు పారేసుకుంటాడు. ఆమె కూడా మనోడి మంచితనం చూసి ప్రేమిస్తుంది. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్న టైంలో బచ్చన్‌కు మళ్ళీ ఉద్యోగంలో చేరమని ఫోను వస్తుంది. అదే టైంలో ఎంపీ ముత్యం జగ్గయ్య ( జగపతిబాబు ) ఇంట్లో రైడ్ చేయాల్సి ఉంటుంది. తన అరాచకాలతో మొత్తం వ్యవస్థని తన క‌నుసైగ‌లతో కంట్రోల్ చేసే జగ్గయ్యను బచ్చన్ ఎలా ? ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి స‌వాళ్లు ఎదురయ్యాయి ? బచ్చన్ – జిక్కి పెళ్లి జరిగిందా లేదా అన్నదే ఈ సినిమా కథ‌.

విశ్లేషణ :
దేశ చరిత్రలోనే ఆదాయపు పన్ను శాఖ చేసిన ఓ అతిపెద్ద రైడ్ ఆధారంగా చేసుకుని హిందీ రైడ్‌ సినిమా తెరకెక్కింది. హరీష్‌ శంకర్ దాన్నే మూలకథ‌గా తీసుకుని మన తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా చాలా మార్పులు చేర్పులు చేశాడు. ఈ మార్పులలో ప్రధానంగా చెప్పుకోదగింది అక్కడ లేని లవ్ ట్రాక్ ఇక్కడ రాసుకున్నాడు. అదే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. సినిమా ఫస్ట్ ఆఫ్ లో ప్రేక్షకులకు ఈ లవ్ ట్రాక్ కావాల్సినంత వినోదం పంచింది. వాస్తవంగా చూస్తే ఇది అసలు సిసలు మాస్ కథ‌.. దీనికి ఫస్ట్ ఆఫ్ లో లవ్ ట్రాక్ జోడించడంతో మంచి మాస్ కళ వచ్చింది. ఈ కథలో పెద్దగా కొత్తదనం ఉండదు. ఓ అదిరిపోయే ఇంట్రడక్షన్ ఫైట్ తో ఠ‌క్కున బచ్చన్ తెరపై దిగిపోతాడు.

అనంతరం పెళ్లిచూపులు.. వ్యాపారిపై రైడింగ్ చేయటం ఇలా ఫస్ట్ ఆఫ్ కావలసినంత వినోదం పంచుతూ చక చక ముందుకు వెళుతుంది. బచ్చన్ సస్పెండ్ అయ్యి సొంత ఊరికి వెళ్లడంతో కథ‌ రొమాంటిక్ కోణంలోకి మారి చూసే వాళ్లకు మంచి రిలీఫ్ గా ఉంటుంది. ఇంటర్వెల్ కు ముందు ఎంపీ జగ్గయ్య ఇంటిపై రైడ్ కి వెళ్ళటం.. అక్కడ బచ్చన్ చేసే యాక్షన్ హంగామా కథను రసవత్తరంగా మారుస్తాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ను చాలా ఆసక్తిగా తన మ్యాజిక్ తో మలిచిన దర్శకుడు హరీష్ శంకర్ … సెకండాఫ్ లో తడబడ్డాడు. ఇది పూర్తిగా ఐటి రైడ్‌ నేపథ్యంలో అల్లుకున్న కథ‌. సెకండ్ హాఫ్ అంత దానిమీద నడపాలంటే కాస్త సీరియస్‌నెస్ కనిపించాలి.. ప్రతి నాయకుడిని ఢీకొట్టే క్రమంలో హీరో అస్సలు కష్టపడినట్టు ఉండదు.

ప్రారంభంలో జగపతిబాబు పాత్ర కరుడుగట్టిన విలన్ గా చూపించిన తర్వాత బచ్చన్ కు జగపతిబాబు నుంచి ఎలాంటి సవాళ్లు ఉండవు. దీంతో కథలో సంఘర్షణ పూర్తిగా మిస్ అయిపోయింది. మధ్యలో సిద్ధూ జొన్నలగడ్డ యాక్షన్ కాస్త ఊపు తీసుకొచ్చినా క్లైమాక్స్ కూడా మరి రొటీన్ గా ముగించేశాడు హరీష్ శంకర్.
ఇక మిస్టర్ బచ్చన్ పాత్రలో రవితేజ ఈ వయసులో కూడా చాలా హుషారుగా నటించాడు. రవితేజ అభిమానులు.. మాస్ అభిమానులు రవితేజను ఎలా చూడాలనుకుంటారో ? హరీష్‌ శంకర్ కూడా అచ్చం అలాగే చూపించాడు. తెరపై రవితేజ హీరోయిజం.. స్టైల్‌, డైలాగ్ డెలివరీ.. యాక్షన్ సీక్వెన్స్ అన్ని ఆకట్టుకుంటాయి. జిక్కీ పాత్రలో హీరోయిన్ భాగ్యశ్రీ చాలా అందంగా కనిపించింది.

పాటల్లో మరింత గ్లామరస్ గా కనిపించింది.. డాన్సుల్లోనూ అదరగొట్టింది. రవితేజతో కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఆమెకు ఇది తొలి సినిమా అయినా సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మెచ్చుకోదగిన విషయం. జగపతిబాబు పాత్ర చాలా పవర్ ఫుల్ గా కనిపించినా… తర్వాత డమ్మీగా మారిపోయింది సిద్దు జొన్నలగడ్డ పాత్ర తెరపై కనిపించింది కొద్దిసేపు అయినా ఆ ఎపిసోడ్ అలరిస్తుంది.. ఒక పాటలో మ్యూజిక్ డైరెక్టర్ రవి శ్రీ ప్రసాద్ కూడా తళుక్కున మెరిశారు. దర్శకుడు హరీశంకర్ కథలో చేసిన మార్పులు.. కొన్ని డైలాగులు బాగా పేలాయి. ఫ‌స్టాప్ లో బలమైన కథ‌లేకున్నా లవ్ ట్రాక్.. కామెడీ బాగుంది. అయితే అసలు కథలోకి వెళ్ళాక పూర్తిగా గాడి తప్పేసింది. టెక్నికల్గా ఈ సినిమాకు తొలి హీరో మీక్కీ జే మేయర్ కథ‌కు తగినట్టుగా మంచి క్యాచీ ట్యూన్స్ ఇచ్చారు.. ఆయ‌నాక బోస్‌ సినిమాటోగ్రఫీ బాగుంది.

ఫైన‌ల్‌గా…
హిందీ రైడ్ ఆథారంగా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ అంటూ వ‌చ్చిన ఈ సినిమాలో ర‌వితేజ ఎనర్జీ, ఫ‌స్టాఫ్ ప్రేమ‌క‌థ‌, భాగ్య శ్రీ అందాలు.. పాట‌లు బాగున్నాయి.. సెకండాఫ్‌తో రొటీన్ క‌థ‌.. రొటీన్ క్లైమాక్స్ మైన‌స్ అయ్యాయి.. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మాస్ ప్రేక్ష‌కుల‌ను కొంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందేమో గాని గొప్ప సినిమా కాదు.. బిలో యావ‌రేజ్ అన‌డం కూడా క‌ష్ట‌మే..

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ రేటింగ్ : 2 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news