Moviesమెగాస్టార్ సినిమాకు డైరెక్ట‌ర్ కావాలి… ఇదేం ట్విస్ట్ బాబు..?

మెగాస్టార్ సినిమాకు డైరెక్ట‌ర్ కావాలి… ఇదేం ట్విస్ట్ బాబు..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చేయాల్సిన సినిమాకు కథ‌ రెడీగా ఉంది.. నిర్మాత కూడా రెడీగా ఉన్నారు.. కానీ దర్శకుడు సెట్ కావడం లేదు. దాదాపు 7 – 8 నెలల నుంచి ఇది నలుగుతూ వస్తుంది. ఇప్పటివరకు చాలామంది దర్శకుల పేర్లు తెరమీదకు వచ్చాయి. ముందుగా కళ్యాణ్ కృష్ణ కురసాల పేరు వినిపించింది. ఆ తర్వాత గాడ్ ఫాదర్ సినిమా డైరెక్టర్ మోహన్ రాజా పేరు ఫైనల్ అయిందని అన్నారు.

ఈ సినిమాకు రచయిత బి వి ఎస్ రవి కథను అందిస్తున్నారు.. స్క్రీన్ ప్లే కూడా తయారు చేస్తున్నారు.
గతంలో లూసిఫర్ రీమేక్ మోహనరాజా సమర్థవంతంగా హేండిల్ చేశారు. అందువల్ల విశ్వంభ‌ర త‌ర్వాత చిరు సినిమాకు కూడా మోహన‌రాజా పేరు ఫైనల్ అవుతుందని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆయనను పక్కన పెట్టేసినట్టు తెలుస్తుంది.. వేరే దర్శకుడు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

రెండు మూడు పేర్లు కూడా నలుగుతున్నాయి. గతంలో ప్రభాస్‌తో పని చేసిన ఓ దర్శకుడు పేరు కూడా వినిపిస్తోంది. బి వి ఎస్ రవి అందించిన కథ ఏ జాన‌ర్ అన్నది తెలియట్లేదు. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎందుకు సెట్ కావడం లేదు ? అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. కథ‌ అయితే చాలా భారీగా ఉంటుందని అందువల్ల ఈ రేంజ్ కథను హ్యాండిల్ చేసే దర్శకుడు కోసం చూస్తున్నారని తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news