Moviesమ‌హేష్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ శ్రీ‌మంతుడుకు 9 ఏళ్లు.. అప్ప‌ట్లో ఈ చిత్రం...

మ‌హేష్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ శ్రీ‌మంతుడుకు 9 ఏళ్లు.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎంత క‌లెక్ట్ చేసిందో తెలుసా?

1 – నేనొక్కడినే, ఆగ‌డు చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ను ఖాతాలో వేసుకుని నిరాశ‌లో కూరుకుపోయిన టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన సినిమా శ్రీ‌మంతుడు. ఈ మూవీ థియేట‌ర్స్ లో విడుద‌లై తాజాగా 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. కొర‌టాల శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మ‌హేష్ బాబుకు జోడిగా శృతి హాసన్ యాక్ట్ చేసింది. జ‌గ‌ప‌తిబాబు, రాజేంద్ర ప్ర‌సాద్, సుకన్య, సంపత్ రాజ్, ముఖేష్ రిషి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు.

జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ల‌పై నిర్మిత‌మైన శ్రీ‌మంతుడు 2015 ఆగ‌స్టు 7న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకునే కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. దాదాపు 2500 స్క్రీన్‌లలో రిలీజ్ అయిన శ్రీ‌మంతుడు.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. వాణిజ్యపరంగా విజయవంతమైంది.

రూ. 50 కోట్ల బడ్జెట్ తో శ్రీ‌మంతుడు సినిమాను నిర్మించ‌గా.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 85.20 కోట్ల షేర్, రూ. 160కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రూ. 28 కోట్ల వరకు ప్రాఫిట్స్ ను అందించింది. ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు రాబ‌ట్టిన మూడవ తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. అలాగే శ్రీ‌మంతుడు ఉత్తమ పాపులర్ ఫీచర్ ఫిల్మ్‌తో సహా మూడు నంది అవార్డులను గెలుచుకుంది. మహేష్ బాబుకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ సౌత్ అవార్డును తెచ్చిపెట్టింది. ఇక శ్రీ‌మంతుడు విడుద‌ల త‌ర్వాతే నటీనటులు, రాజకీయ నాయకులు మ‌రియు వ్యాపార‌వేత్త‌లు వెనుకబడిన గ్రామాలను ద‌త్త‌త తీసుకుని అభివృద్ధి చేయడం ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news