Moviesమ‌హేష్ బాబు - రాజ‌మౌళి సినిమాకు అదిరిపోయే టైటిల్‌..!?

మ‌హేష్ బాబు – రాజ‌మౌళి సినిమాకు అదిరిపోయే టైటిల్‌..!?

ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అనంత‌రం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌న త‌దుప‌రి చిత్రాన్ని టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వీరి కాంబో ప్రాజెక్ట్ ను అత్యంత భారీ బ‌డ్జెట్ తో సీనియర్ ప్రొడ్యూసర్ కె. ఎల్ నారాయణ నిర్మించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ సినిమాపై ఏదైనా అప్డేట్ వ‌స్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూశారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. మ‌హేష్ బాబు 29వ‌ సినిమా యాక్షన్‌ అడ్వెంచర్‌గా రాబోతోంద‌న్న స‌మాచారం త‌ప్పితే.. ఇంత‌వ‌ర‌కు ఎటువంటి అప్డేట్స్ లేవు. అయితే ఇలాంటి స‌మ‌యంలో విజువల్‌ డెవల‌ప్మెంట్‌ ఆర్టిస్ట్‌ టీపీ విజయన్ మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమా టైటిల్ పై క్రేజీ హింట్ ఇచ్చాడు.

తాజాగా విజ‌య‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కలను పోస్ట్ చేశాడు. #SSMB29, #SSMB29DIARIES అనే హ్యాష్‌ ట్యాగ్స్ కూడా ఇవ్వ‌డంతో.. మ‌హేష్ బాబు-రాజ‌మౌళి సినిమాకు ‘గరుడ’ అనే టైటిల్ పెట్ట‌బోతున్నార‌ని ప్ర‌స్తుతం జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పైగా గ‌తంలో ఒక సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ.. బాహుబ‌లి త‌ర్వాత త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ గ‌రుడ అని ప్ర‌క‌టించారు. దీంటో నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లం చేకూరింది.

అయితే ఇంతవ‌ర‌కు టైటిల్ పై చిత్ర‌బృందం నుంచి ఎటువంటి అధికారిక ప్ర‌ట‌క‌న రాలేదు. కానీ గ‌రుడ టైటిల్ కు మాత్రం సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. గ‌రుడ టైటిల్ అదిరిపోయింద‌ని మెజారిటీ పీపుల్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రాజ‌మౌళి సినిమాలో మ‌హేష్ బాబు స‌రికొత్త అవ‌తార్ లో కనిపించ‌బోతున్నాడు. ఇందులో భాగంగానే గ‌త కొద్ది రోజుల నుంచి మ‌హేష్ భారీగా జుట్టు కూడా పెంచుతున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news