Moviesస్టార్ హీరోతో లవ్.. చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన గజాల.....

స్టార్ హీరోతో లవ్.. చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన గజాల.. ఆ రోజు ఏం జ‌రిగింది..?

హీరోయిన్ గజాల అంటే ఇప్పటి సినీ ప్రియులకు తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో ఈ హీరోయిన్ కి చాలామంది అభిమానులు ఉండేవారు. అయితే 90s వారికి హీరోయిన్ గజాల తెలిసే ఉంటుంది. ఇక ఇప్పటి జనరేషన్ కి తెలియాలంటే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్. 1 సినిమాలో హీరోయిన్ అంటే అందరికీ టక్కును గుర్తుకు వస్తుంది. అయితే హీరోయిన్ గజాల ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరుసగా తమిళ, మలయాళ,తెలుగు సినిమాల్లో నటించింది.

అయితే ఈ ముద్దుగుమ్మ ఒకానొక సమయంలో నిద్ర మాత్రం మింగి చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. మరి ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి..ఎందుకు అలాంటి పని చేసింది అనేది ఇప్పుడు చూసుకుందాం.. హీరోయిన్ గజాల తెలుగులో స్టూడెంట్ నెంబర్ వన్, కలుసుకోవాలని, తొట్టి గ్యాంగ్,జానకి వెడ్స్ శ్రీరామ్, ఓ చిన్నదానా, అల్లరి రాముడు, భద్రాద్రి, విజయం వంటి సినిమాల్లో నటించింది.అలాగే వెంకటేష్ హీరోగా చేసిన మల్లీశ్వరి మూవీలో స్పెషల్ సాంగ్లో ఈ ముద్దుగుమ్మ వెంకీ తో ఆడిపడింది.

అయితే అలాంటి ఈ హీరోయిన్ గతంలో అంటే 2002లో సూసైడ్ చేసుకొని చనిపోవాలని చూసింది. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ప్రశాంత్ కుటీర్ అనే గెస్ట్ హౌస్ లో స్లీపింగ్ పిల్స్ వేసుకొని ఆత్మహత్య చేసుకోవాలని చూసింది.కానీ సరైన సమయానికి అక్కడికి నటుడు అర్జున్ సార్జా, నటి సుల్తానాలు అక్కడికి వచ్చి ఆమెను హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. సరైన సమయానికి చికిత్స అందడంతో గజాల చావు బతుకుల నుండి బయటపడింది. అలా గజాల చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది.

అయితే ఈమె సూసైడ్ చేసుకోవడానికి అసలు కారణాలు బయట పడలేదు.కానీ టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో మాత్రం ఓ హీరో కారణంగానే ఈమె సూసైడ్ చేసుకుందానే టాక్ వినిపించింది. ఒక హీరోతో ప్రేమలో పడ్డ గజాల ఆయన మోసం చేసేసరికి అది భరించలేక చనిపోదామనుకుందనే రూమర్ వినిపించింది. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు. ఇక సూసైడ్ నుండి బయటపడ్డ గజాల పైజల్ రజా ఖాన్ అనే హిందీ టీవీ నటుడిని పెళ్లాడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news