Moviesప్రైవేట్ జెట్ ను కొనుగోలు చేసిన కోలీవుడ్ స్టార్ సూర్య‌.. ఎన్ని...

ప్రైవేట్ జెట్ ను కొనుగోలు చేసిన కోలీవుడ్ స్టార్ సూర్య‌.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకే!

సినీ తార‌ల ల‌గ్జ‌రీ లైఫ్ స్టైల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేద‌. వారు ఉండే ఇళ్ల ద‌గ్గ‌ర నుంచి వేసుకునే దుస్తులు, తిరిగే వాహ‌నాలు ఇలా ప్ర‌తీది ఎంతో ఖ‌రీదైన‌విగా ఉంటాయి. చిరంజీవి, నాగార్జున‌, అల్లు అర్జున్‌, మ‌హేష్ బాబు, ర‌జ‌నీకాంత్ వంటి స్టార్స్ సొంతంగా ప్రైవేట్ జెట్ ను కూడా క‌లిగి ఉన్నారు. అయితే వీరి చెంత ఇప్పుడు కోలీవుడ్ స్టార్ సూర్య కూడా చేరాడ‌ని.. రీసెంట్ గా ఆయ‌న ఓ విలాస‌వంత‌మైన ప్రైవేట్ జెట్ ను కొనుగోలు చేశార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి.

అత్యాధునిక సాంకేతికత, భద్రతా సౌకర్యాలు ఉన్న‌ డస్సాల్డ్ ఫాల్కర్ 2000 జెట్‌ను సూర్య కొనుగోలు చేశారట‌. ఈ ప్రైవేట్ జెట్ ఖ‌రీదు రూ. 120 కోట్లు అని ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో.. నెటిజ‌న్లు షాకైపోతున్నారు. నిజంగా సూర్య ప్రైవేట్ జెట్ కొన్నాడా? అంటూ ఆరాలు తీస్తున్నారు. దీంతో సూర్య‌కు అత్యంత స‌న్నిహితుడైన ఓ వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ప్ర‌చారాన్ని కొట్టిపారేశాడు.

సూర్య గురించి వస్తున్న వార్త‌ల్లో నిజం లేదని.. అతడు ఎలాంటి ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయలేదని అధికారంగా ధృవీకరించారు. కాగా, సూర్య ప్ర‌స్తుతం కంగువ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో కంగువ‌ను నిర్మిస్తున్నారు.

ఇందులో దిశా ప‌టాని హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. బాబీ డియోల్, జగపతి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, యోగి బాబు త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ద‌స‌రా పండుగ కానుక‌గా కంగువ సినిమా అక్టోబర్ 10 థియేటర్లలోకి రాబోతోంది. ఇక అదే రోజున రజినీకాంత్ నటించిన వేట్టైయాన్ సినిమా కూడా రిలీజ్ కానుండ‌టం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news