Moviesఅఖిల్ ఎంగేజ్మెంట్ బ్రేక్ అవ్వడానికి కారణం ఆ యంగ్ హీరోనా..?

అఖిల్ ఎంగేజ్మెంట్ బ్రేక్ అవ్వడానికి కారణం ఆ యంగ్ హీరోనా..?

అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లికి రెడీ అవ్వడంతో అఖిల్ కి సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే అఖిల్ గతంలో శ్రియా భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇక పెళ్లికి కొద్దిరోజుల సమయం ఉంది అనగా ఏమైందో ఏమో తెలియదు కానీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగి నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ రద్దు అయిన సమయంలో మీడియాలో అఖిల్ గురించి ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే వీరి బ్రేకప్ చెప్పుకున్న సందర్భంలో ఓ వార్త బలంగా వినిపించింది.

అదేంటంటే అఖిల్ కి వేరే అమ్మాయిలతో ఎఫైర్ ఉంది అని శ్రియా భూపాల్ వదిలేసిందని కొంతమంది అంటే మరికొంతమందేమో శ్రేయ భూపాల్ కి వేరే వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్ ని తప్పుగా అర్థం చేసుకున్న అఖిల్ ఆమెని దూరం పెట్టాడని ఇలా రకరకాల రూమర్స్ వినిపించాయి. అయితే అప్పట్లో అఖిల్ మాజీ ప్రియురాలు శ్రియా భూపాల్ తో అల్లు శిరీష్ ఉన్న ఫోటోస్ నెట్టింట్లో చాలా వైరల్ అయ్యాయి. అయితే అల్లు శిరీష్ కి శ్రియా భూపాల్ కి మధ్య చెడుగా అర్థం చేసుకోవాల్సిన బంధం ఏమీ లేదు.వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్.అంతే కాకుండా శ్రియా భూపాల్ ఉపాసన కజిన్ అనే సంగతి కూడా మనకు తెలిసిందే.

అలా అల్లు శిరీష్ శ్రియా భూపాల్ కి సంబంధించిన ఫోటో నెట్టింట్ల చక్కర్లు కొట్టింది. ఇక అదే సమయంలో అఖిల్ నిశ్చితార్థం రద్దు చేసుకున్నాడనే వార్తలు మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది అక్కినేని ఫ్యాన్స్ అల్లు శిరీష్ వల్లే అఖిల్ పెళ్లి చెడిపోయిందని కామెంట్స్ చేశారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. అలాగే అఖిల్, అల్లు శిరీష్ ఇద్దరు ఎక్కడ మాట్లాడుకోరు అనే వాదన కూడా గతంలో వినిపించింది. ఓ ఈవెంట్లో వీరిద్దరూ హాజరైన కూడా ఎడమొహం పెడమొహం పెట్టుకున్నారని వీరిద్దరి మధ్య మాటలు లేవు అనే రూమర్స్ కూడా వినిపించాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు.

అలాగే అఖిల్ శ్రియా భూపాల్ ల నిశ్చితార్థం రద్దు కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. దానికి కారణం అల్లు శిరీష్ కానే కాదు.ఒకవేళ అదే నిజమైతే అల్లు అరవింద్ అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి సినిమా వ్యవహారాలను చూసుకునేవాడు కాదు. కానీ అల్లు అరవింద్ తన బ్యానర్లో అక్కినేని ఫ్యామిలీ వారికి సంబంధించిన సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఒకవేళ అల్లు శిరీష్ కి అఖిల్ కి మధ్య గొడవ ఉంటే అల్లు అరవింద్ కూడా వారితో సినిమాలు తీయరు కదా అంటున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్స్

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news