నందమూరి నటసింహం బాలకృష్ణ నటప్రస్థానానికి 50 ఏళ్లు… బాలకృష్ణ తొలి సినిమా తాతమ్మ కల 1974 ఆగస్టు 30న రిలీజ్ అయింది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న బాలయ్యను సన్మానించాలని టాలీవుడ్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం నేపథ్యంలో ఆయన జీవన విధానం గురించి సోషల్ మీడియా ఒక్కటే జరుగుతుంది. బాలయ్య తెల్లవారుజామున 3.30 గంటలకు నిద్రలేచి గంటపాటు వ్యాయామం చేస్తూ ఉంటారు. సూర్యోదయానికి ముందే బాలయ్య పూజ పూర్తవుతుంది. తన తండ్రి ఎన్టీఆర్ సినిమాలు తప్ప బాలయ్య ఇతర హీరోల సినిమాలు చూడరు.
రోజు ఎన్టీఆర్ సినిమా ఏదో ఒకటి కొద్ది నిమిషాలు అయినా చూసిన తర్వాతే ఆయన నిద్రకు ఉపక్రమిస్తారు. బాలయ్య ఎంత బిజీగా ఉన్న ప్రతిరోజు వార్తాపత్రికలు చదువుతారు. పుస్తక పఠణం తక్కువే ఎక్కువగా తన గురించి సినిమా కథల గురించి మాత్రమే బాలయ్య ఆలోచన చేస్తూ ఉంటారు. బాలయ్య మనసుకు నచ్చిందే చేస్తుంటారు. డైట్ పేరుతో నోరు కట్టేసుకోరు.. సినిమాల్లో పాత్రలకు తగినట్టుగా ఒదిగిపోయేందుకు శరీరాకృతిని మార్చుకుంటారు. బాలయ్య ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టేస్తూ ఉంటారు.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయించి సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక తన విజయాల వెనక సతీమణి వసుంధర పాత్ర ఎంత ఉందని చెపుతుంటారు.
ఆయన కంటికి రెప్పలా చూసుకుంటూ భార్యపై ప్రేమను చాటుకుంటూ ఉంటారు. బాలయ్య మనవళ్లతో ఉన్నప్పుడు చిన్నపిల్లాడిలా మారిపోతారు. వారిని సీఎం ( క్లాస్ మనవడు ) – ఎంఎం ( మాస్ మనవడు ) అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. బాలయ్య కాలేజీ చదువుకునే రోజుల్లో క్రికెట్ ఎక్కువగా ఆడేవారు. స్కూల్ డేస్ లో ఆయన టేబుల్ టెన్నిస్లో ఛాంపియన్.. అలాగే బాస్కెట్బాల్ టీం కెప్టెన్.. కబడ్డీ టీం కెప్టెన్ గా ఉండేవారు. ఎన్టీఆర్ ఇచ్చిన డిజైన్ ఆధారంగానే బాలకృష్ణ ఇల్లు నిర్మించుకున్నారు.
లక్ష్మీనరసింహస్వామి అంటే బాలయ్యకు అపరిమితమైన భక్తి.. సినిమాలపరంగా సింహ పేరు బాలయ్యకు సెంటిమెంట్ అన్నది తెలిసిందే. బాలయ్యకు తెలుగు అంటే మమకారం.. ఆయనకు ఒక మాస్టర్ ప్రత్యేకంగా పద్యాలు నేర్పేవారు. తెలుగు పద్యాలు నేర్చుకోకపోతే గురువు తొడపాశం పెడతారు అన్న భయంతో బాలయ్య తెలుగు భాషను బాగా నేర్చుకున్నారు.. ఇక నెగిటివ్ ఆలోచనలు లేకపోవడం కల్మషం లేకపోవటమే.. తన ఆరోగ్య రహస్యమని బాలయ్య పప్పలు సందర్భాలలో చెప్పారు.