Moviesవిజ‌య‌వాడ‌లో ఇంద్ర ర‌జతోత్స‌వ వేడుక‌లు… అప్ప‌ట్లో ఓ పొలిటిక‌ల్ స్టోరీ..?

విజ‌య‌వాడ‌లో ఇంద్ర ర‌జతోత్స‌వ వేడుక‌లు… అప్ప‌ట్లో ఓ పొలిటిక‌ల్ స్టోరీ..?

మెగాస్టార్ చిరంజీవి 2001 సంక్రాంతి కానుకగా మృగరాజు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. మెగా అభిమానులు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. అదే ఏడాది వేసవిలో శ్రీ మంజునాథ సినిమా కూడా నిరాశపరిచింది. అదే ఏడాది అక్టోబర్ 4న సురేష్ కృష్ణ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాతగా వచ్చిన డాడీ సినిమా కూడా అంచనాలు అందుకోలేదు. ఒకే ఏడాది చిరంజీవికి మూడు సినిమాలు నిరాశపరిచాయి. ఇక చిరంజీవి పని అయిపోయింది అని.. అందరూ అనుకుంటున్న టైంలో యేడాది పాటు గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇంద్ర.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై చలసాని అశ్వ‌నీద‌త్ నిర్మించిన ఈ సినిమాకు యాక్షన్ చిత్రాల దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వం వహించారు. 2002 జూలై 24న రిలీజ్ అయిన ఇంద్ర ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపేసింది. థియేటర్లు పూన‌కాలతో ఊగిపోయాయి. 122 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకున్న ఇంద్ర పలు కేంద్రాలలో 175 రోజులు కూడా ఆడింది. ఇంద్ర రజ‌తోత్సవ వేడుకలను ఇంద్రకీలాద్రి అమ్మవారి సాక్షిగా విజయవాడలో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలు విజయవాడలో నిర్మాత అశ్వినీద‌త్‌ నిర్వహించడం వెనక పొలిటికల్ స్టోరీ కూడా నడిచింది.

ఆ మ‌రుస‌టి యేడాది అంటే 2004లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. అశ్వినీద‌త్‌ తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడిపోయారు. అశ్వినీద‌త్‌ విజయవాడ ఎంపీగా పోటీ చేయాలన్న ముందస్తు ప్రణాళికలో భాగంగా ఇంద్ర విజయోత్సవ వేడుకలు ఇంద్రకీలాద్రి నగరంలో నిర్వహించారు అన్నది బహిరంగ రహస్యం. అయితే ఇంద్ర విజయోత్సవ వేడుకలు విజయవాడలో సూపర్ హిట్ అయ్యాక.. ఎన్టీఆర్ ఆంధ్రావాలా ఫంక్షన్ ను పూరి జగన్నాథ్ … ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరులో చాలా గ్రాండ్‌గా నిర్వహించి సక్సెస్ చేయడం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news