చాలామంది 90’s లో నటించిన హీరోయిన్లు అనారోగ్య సమస్యల కారణంగా లేదా పిల్లలు పుట్టడం వల్ల లావైపోయి గుర్తు పట్టనంతగా మారిపోతున్నారు. అలాంటి వారిలో సంఘవి కూడా ఒకరు. ఒకప్పుడు తన చబ్బీ చీక్స్ తో తన కటౌట్ తో ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకున్న సంఘవి ప్రస్తుతం షేప్ అవుట్ అయిపోయి సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇక సినిమాలకు దూరమైనప్పటికీ బుల్లితెర షోలకు జడ్జిగా చేస్తూ అప్పుడప్పుడు సినీ ప్రియులను పలకరిస్తుంది.
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మని ఆ హీరో తో తిరిగితే కెరీర్ నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చింది ఎవరు? ఇంతకీ ఆ హీరో ఎవరు..అనేది ఇప్పుడు చూద్దాం.. తమిళ హీరో విజయ్ తలపతి, సంఘవి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే వీరిద్దరి కెమిస్ట్రీ బాగుండడంతో విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ వీరి కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు తీశారు. అలా విజయ్, సంఘవి వరుస సినిమాల్లో చేసేసరికి ఇద్దరి మధ్య క్లోజ్నెస్ పెరిగి ప్రేమలో పడ్డారనే టాక్ తమిళ మీడియాలో ఉంది.
దాంతో ఈ విషయం ఎక్కువగా వైరల్ అయ్యే సరికి తన కొడుకు కెరీర్ పై ఎక్కడ మచ్చ పడుతుందోనని భావించిన విజయ్ తండ్రి డైరెక్టర్ చంద్రశేఖర్ సంఘవి ఇంటికి వెళ్లి సంఘవి కి ఆమె తల్లి ఇద్దరికీ కలిపి వార్నింగ్ ఇచ్చారట. నా కొడుకుతో ఇంకోసారి కలిసి తిరిగితే మాత్రం బాగుండదు. ఏదో సినిమాల వరకైతే ఓకే.. కానీ మీ ఇద్దరి గురించి వేరే మాట్లాడుకుంటున్నారు. అలా చేస్తే నీ సినీ కెరియర్ తో పాటు నా కొడుకు సినీ కెరీర్ కూడా పోతుంది.
ఇప్పుడిప్పుడే వాడు సినిమాల్లో రాణిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఈ రూమర్ వస్తే వాడి భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. ఇప్పటినుండి నా కొడుకుతో తిరిగితే మాత్రం సినిమాల్లో అవకాశాలు రాకుండా నీ సినీ కెరీర్ నాశనం చేస్తా అంటూ విజయ్ తండ్రి సంఘవికి వార్నింగ్ ఇచ్చారట.అంతేకాదు అప్పటి వరకు సంఘవి చేతిలో ఉన్న సినిమాలన్నీ విజయ్ తండ్రి తన పలుకుబడితో పోగొట్టారనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది. ఇక ఆ సమయంలో తమిళ సినిమాలకు దూరమై తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సంఘవి ఇక తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించింది.