ప్రముఖ హీరోయిన్ అమలా పాల్ గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. సౌత్ సినీ ప్రియులకు ఈ మలయాళ బ్యూటీ అత్యంత సుప్రసిద్ధురాలు. 2009లో నీలతామర అనే సినిమాతో నటనా వృత్తిని ప్రారంభించిన అమలా పాల్.. కెరీర్ ఆరంభంలో చాలా స్ట్రగ్గుల్స్ ను ఫేస్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా నిలదొక్కుకుంది. స్టార్ హోదాను సంపాదించుకుంది. కథ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికైనా తాను వెనకాడనని ఆడై సినిమాతో నిరూపించుకుంది.
ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే.. 2011 లో దైవ తిరుమగల్ సినిమాకు పని చేస్తున్నప్పుడు దర్శకుడు ఏఎల్ విజయ్‌తో అమలా పాల్ ప్రేమలో పడింది. 2014లో అతనితో కలిసి ఏడడుగులు వేసింది. అయితే వివాహం అనంతరం యాక్టింగ్ మానేయాలని విజయ్ పేరెంట్స్ అమలా పాల్ ను ఒత్తిడికి గురి చేశారు. ఈ క్రమంలోనే తలెత్తిన విభేదాల కారణంగా 2017లో విజయ్ కు అమలా పాల్ విడాకులు ఇచ్చేసింది. అప్పటి నుంచి కెరీర్ పరంగా మరింత బిజీ అయిన అమలా పాల్.. 2023లో వ్యాపారవేత్త జగత్ దేశాయ్‌ని ప్రేమ వివాహం చేసుకుంది.
పెళ్లై ఏడాది తిరక్క ముందే ఈ దంపతులు 2024 జూన్ లో ఇలై అనే కుమారుడికి జన్మించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలా పాల్.. తన సెకండ్ మ్యారేజ్ కి సంబంధించి కొన్ని షాకింగ్ సీక్రెట్స్ ను రివీల్ చేసింది. తాను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యానని కుండబద్దలు కొట్టింది. అమలా పాల్ మాట్లాడుతూ.. నేను నా లైఫ్ లో మొదటి దశలో చాలా నష్టపోయాను. అందువల్ల రెండవ దశను స్టార్ట్ చేయడానికి వెనకడుగు వేశాను.
కానీ నా భర్త జాగ్రత్త దేశాయ్ నా ఆలోచనలన్నిటినీ మార్చేశాడు. మ్యారేజ్ కి ముందు ఇద్దరం డేటింగ్ చేశాం. డేటింగ్ ప్రారంభించిన నెల రోజులకే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. దాంతో వెంటనే పెళ్లి చేసుకున్నాము. ప్రస్తుతం లైఫ్ చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమలా పాల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.