Moviesహీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లి కుదిరిందోచ్‌.. ఇంత‌కీ అబ్బాయిని చూశారా..?

హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లి కుదిరిందోచ్‌.. ఇంత‌కీ అబ్బాయిని చూశారా..?

ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస‌గా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఫిల్మ్ స్టార్స్ ఒక‌రి త‌ర్వాత ఒక‌రు త‌మ సింగిల్ లైఫ్ కు ఎండ్ కార్డు వేస్తున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెండెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం త‌న ప్రియ‌స‌ఖి ర‌హ‌స్య గోర‌క్ తో ఏడ‌డుగులు వేశాడు. ఇంత‌లోనే మ‌రో హీరోయిన్ కు పెళ్లి కుదిరింది. చెన్నై సోయ‌గం మేఘా ఆకాష్ త్వ‌ర‌లోనే ఓ ఇంటి కాబోతోంది.

తెలుగు తండ్రి మరియు మలయాళీ తల్లికి జన్మించిన మేఘా ఆకాష్‌.. 2017లో లై మూవీతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోయినా మేఘా ఆకాష్ కు మాత్రం మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌ర్వాత తెలుగు లో చల్ మోహన్ రంగ, రాజ రాజ చోర, డియ‌ర్ మేఘా, గుర్తుందా శీతాకాలం, రావ‌ణాసుర త‌దితర చిత్రాల్లో న‌టించింది.

త‌మిళంలోనే ప‌దుల సంఖ్య‌లో సినిమాలు చేసింది. స్టార్ హోదాను అందుకోలేక‌పోయినా.. అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్ లో మేఘా ఆకాష్ త‌న‌కంటూ ఒక స్పెష‌ల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. అయితే 28 ఏళ్ల మేఘా ఇప్పుడు పెళ్లికి సిద్ధం అయింది. సాయి విష్ణు అనే కుర్రాడితో మూడు ముళ్లు వేయించుకోబోతోంది. కొన్నాళ్ల నుంచి ల‌వ్ లో ఉన్న ఈ జంట‌.. మ‌రికొద్ది రోజుల్లో వైఫ్ అండ్ హ‌స్పెండ్ గా ప్ర‌మోట్ కాబోతున్నారు.

ఆగ‌స్టు 22న సాయి విష్ణుతో మేఘా ఆకాష్ నిశ్చితార్థం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహిత‌ల స‌మ‌క్షంలో వైభవంగా జ‌రిగింది. అనంత‌రం మేఘా ఆకాష్ సోష‌ల్ మీడియా ద్వారా త‌న‌కు కాబోయే భ‌ర్త‌ను అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది. నా కోరిక నిజమైంది… ప్రేమ, నవ్వులు, ఆనందం అన్నీ ఇక నీతోనే.. నా జీవితానికి ప్రేమను పరిచయం చేసిన వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగింది అంటూ సాయి విష్ణుతో దిగిన కొన్ని అంద‌మైన ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. దీంతో అభిమానులు మ‌రియు సెల‌బ్రిటీలు వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు. క్యూట్ క‌పుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సాయి విష్ణుకు సంబంధించి ఎటువంటి వివ‌రాలు బ‌య‌ట‌కు రాలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news