టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజకు సర్జరీ జరిగింది. ఆయన కూడిచేతికి వైద్యులు ఆపరేషన్ చేశారు. హాస్పిటల్‌లో రవితేజ చికిత్స తీసుకుంటున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అభిమానులు కంగారు పడుతున్నారు. రవితేజకు ఏం జరిగింది..? ఎందుకు ఆసుపత్రిలో ఉన్నారు..? అంటూ ఆరాలు తీస్తున్నారు. కానీ అంతగా భయపడాల్సిన అవసరం లేదు. రవితేజ ప్రస్తుతం సేఫ్‌గానే ఉన్నారు.
సామజవరగమన వంటి సూపర్ హిట్ చిత్రానికి రచయితగా పని చేసిన భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ తన 75వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్‌టీ 75 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా పట్టాలెక్కింది. అయితే చిత్రీకరణ సమయంలో ఓ చిన్న ప్రమాదరం జరగడంతో రవితేజ రవితేజ కుడిచేతి కండరాలు చిట్లింది. లెక్క చేయకుండా రవితేజ షూట్‌లో పాల్గొన్నారు. దాంతో గాయం మరింత పెద్దగా మారింది.
నొప్పి కూడా చాలా తీవ్రంగా మారడంతో హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌లో రవితేజ అడ్మిట్ అయ్యారు. గాయాన్ని పరిశీలించిన వైద్యులు.. వెంటనే రవితేజ కూడిచేతికి సర్జరీ చేశారు. అనంతరం సర్జరీ నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని రవితేజకు వైద్యులు సూచించారు. ప్రస్తుతం రవితేజ ఆరోగ్యం స్థిమితంగా ఉందని తెలుస్తోంది.
కాగా రవితేజ ఇటీవల మిస్టర్ బచ్చన్ మూవీతోనే ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఆగస్టు 15న విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆర్‌టీ 75 విషయానికి వస్తే.. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. ధమాకా తర్వాత ఈ చిత్రంలో మరోసారి రవితేజ, శ్రీలీల జతకట్టడం విశేషం.