టాలీవుడ్ లో గత రెండు మూడేళ్ల నుంచి హీరోలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలెక్కిస్తున్నారు. గత ఏడాది మంచు మనోజ్, శర్వానంద్, వరుణ్ తేజ్ తో సహా చాలా మంది సెలబ్రిటీలు వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ఇక టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఉస్తాద్ రామ్ పోతినేని ఒకడు. రామ్ ఏజ్ 36. కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయ్యాడు. హీరోగా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులు అలరిస్తున్నాడు. కానీ ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తున్నాడు.
గతంలో రామ్ పెళ్లికి సంబంధించి పలు మార్లు వార్తలు వచ్చినప్పటికీ అవి పుకార్లుగానే మిగిలాయి. అయితే తాజాగా మరోసారి రామ్ పెళ్లి వార్తలకు తెరపైకి వచ్చాయి. ఎట్టకేలకు రామ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలా మంది హీరోలు లవ్ మ్యారేజ్ చేసుకుంటుంటే.. రామ్ మాత్రం అరేంజ్ మ్యారేజ్ కు సిద్ధం అయ్యాడట.
హైదరాబాద్‌లోని ఓ బడా వ్యాపారవేత్త కూతురిని రామ్ వివాహం చేసుకోబోతున్నాడని జోరుగా వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ లో సదరు అమ్మాయితో రామ్ ఎంగేజ్మెంట్ జరగబోతోందట. ఈ ఏడాది చివరల్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో పెళ్లి వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఇరుకుటుంబ సభ్యులు భావిస్తున్నారని బలంగా టాక్ నడుస్తోంది. ఇక ఇదే నిజమై రామ్ ఓ ఇంటివాడైతే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి.
కాగా, రామ్ పోతినేతి త్వరలోనే డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కావ్య థాపర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో సైతం డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కాబోతోంది.