ఎప్పుడో 2007లో స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ – బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ పెళ్లి ఒక సంచలనం రేపింది. చాలా ఏళ్ల పాటు వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి కాపురం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక పాప కూడా జన్మించింది. ఇక గత రెండేళ్లుగా ఐశ్వర్య – అభిషేక్ దూరంగా ఉంటున్నారని.. వీరిద్దరూ విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ ఒకటే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను వీరిద్దరూ గట్టిగా ఖండిస్తున్న సందర్భాలు కూడా లేవు.
తాజాగా ఐశ్వర్యరాయ్ తో అభిషేక్ విడిపోయాడని.. విడాకులు తీసుకున్నాడని చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. అయితే నిజానికి ఇది ఒరిజినల్ కాదు.. ఎవరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డీప్ ఫేక్ క్రియేట్ చేశారు. ఐశ్వర్య రాయ్‌తో విడాకులు తీసుకున్నట్టు చెబుతున్న విషయాన్ని మార్పింగ్ చేశారు. అయితే నెటిజన్లు చాలా ఈజీ గానే గుర్తుపట్టారు. దీనిపై అభిషేక్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.. కనీసం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు.
కానీ ఈ వార్త మాత్రం దేశం మొత్తం పాకేసింది.. అసలు వీరిద్దరు ఎందుకు దూరంగా ఉంటున్నారు ? ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ దంపతుల మధ్య చిచ్చు పెట్టింది ఎవరు ? అన్న ప్రశ్నకు చాలామంది అమితాబ్ భార్య జయాబచ్చన్ వైపు చూశారు.. అయితే ఇప్పుడు సరికొత్త చర్చ తెరమీదకు వస్తోంది. ఐశ్వర్య – అభిషేక్ మంచిలో ఒక డాక్టర్ ఉన్నాడని… జిరాక్ మార్కర్ అనే డాక్టర్ వీళ్లిద్దరి మధ్య చిచ్చు పెట్టాడని బాలీవుడ్ లో కథనాలు వస్తున్నాయి.
ఐశ్వర్య – డాక్టర్ జిరాక్ చాలా సంవత్సరాలుగా మంచి స్నేహితులు.. ఇప్పుడు ఆ స్నేహం కొత్త మలుపు తీసుకుందా ? అనే ప్రచారం నడుస్తోంది. అందుకే బచ్చన్ కుటుంబం ఐశ్వర్య కు దూరంగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. రీసెంట్గా ముకేశ్ అంబానీ చిన్న కొడుక్కి పెళ్లి చేశాడు.. ఈ పెళ్ళికి బచ్చన్ కుటుంబం ఐశ్వర్యరాయ్ వేరువేరుగా హాజరు అయ్యారు.. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారన్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్లు అయింది.