MoviesHBD : నంది అవార్డుల రారాజు.. మ‌న సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌.. !

HBD : నంది అవార్డుల రారాజు.. మ‌న సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌.. !


టాలీవుడ్ హీరోలలో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. నటశేఖర కృష్ణ తనయుడుగా సినిమాల్లోకి వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లోని టాప్ హీరోలలో ఒకరిగా దూసుకుపోతున్నారు. సంక్రాంతికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటించిన మహేష్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్నారు. మహేష్ బాబు 1975 ఆగస్టు 9న మద్రాస్ లో జన్మించారు.

తన నాల్గవ వేట దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నీడ సినిమాతో బాలనటుడుగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తండ్రి కృష్ణతో కలిసి పలు సినిమాలలో నటించారు. ఇక కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో సోలో హీరోగా మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇక మహేష్ బాబు తన కెరీర్లో ఏకంగా ఎనిమిది నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. మహేష్ ఇప్పటి వరకు నటించింది కేవలం 27 సినిమాలే.. అయితే 27 సినిమాలకే ఎనిమిది నంది అవార్డులు సొంతం చేసుకున్న ఏకైక హీరో మహేష్ బాబు అని చెప్పాలి.

రాజకుమారుడు సినిమాతో తొలిసారి ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్న మహేష్ బాబు.. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాకు … త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అతడు – శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దూకుడు – కొరటాల శివ దర్శకత్వం వహించిన శ్రీమంతుడు … మురారి – టక్కరి దొంగ – అర్జున్ సినిమాలకు కూడా నంది అవార్డులు అందుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు అభిమానులు యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అందరూ మహేష్ బాబు – రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news