మంజుల ఘట్టమనేని గురించి పరిచయాలు అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ కూతురిగా, మహేష్ బాబు సోదరిగా మాత్రమే కాకుండా నటిగా, నిర్మాతగా కూడా మంజుల సుపరిచితమే. కృష్ణ, ఇందిరా దేవీల మూడవ సంతానం అయిన మంజుల.. హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలేయాలని ఆశపడింది. కానీ కృష్ణ అభిమానులు మాత్రం అందుకు అంగీకరించలేదు. అందువల్ల కూతురిని హీరోయిన్ గా లాంఛ్ చేయాలన్న ఆలోచనను కృష్ణ విరమించారు.
తర్వాత మంజుల నిర్మాతగా అడుగుపెట్టి పోకిరి, నాని, ఏ మాయ చేసావేతో సహా పలు సినిమాలను ప్రొడ్యూస్ చేసింది. కావ్యాస్ డైరీ, షో, ఆరెంజ్, సేవకుడు, మళ్ళీ మొదలైంది, హంట్ తదితర చిత్రాల్లో సహాయక పాత్రలను పోషించి మెప్పించింది. 2018లో మనసుకు నచ్చింది అనే సినిమాకు మంజుల దర్శకత్వం కూడా వహించింది. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా కొనసాగుతూనే.. మరోవైపు మంజుల సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ను రన్ చేస్తోంది.
మంజుల పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. నటుడు మరియు దర్శకనిర్మాత సంజయ్ స్వరూప్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. దాదాపు ఏడేళ్లు లవ్ చేసుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సంజయ్ స్వరూప్, మంజుల దంపతులకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు జాహ్నవి స్వరూప్. టీనేజ్ లో ఉన్న జాహ్నవి తన స్టడీస్ ను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉంది.
కూతురి ఫోటోలను మంజుల అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అందం విషయంలో జాహ్నవి ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే. అంత బ్యూటీఫుల్‌గా జాహ్నవి ఉంటుంది. గతంలో జాహ్నవి మంజుల డైరెక్ట్ చేసిన మనసుకు నచ్చింది సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత మరే సినిమాలోనూ ఆమె నటించలేదు. మరి భవిష్యత్తులో జాహ్నవి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందో..లేదో.. చూడాలి.