Movies' డ‌బుల్ ఇస్మార్ట్ ' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు… వీక్ టాక్‌తోనూ...

‘ డ‌బుల్ ఇస్మార్ట్ ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు… వీక్ టాక్‌తోనూ కుమ్మి ప‌డేశాడు…?

ఇస్మార్ట్ శంక‌ర్‌కు సీక్వెల్‌గా రామ్ – పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో వ‌చ్చిన డ‌బుల్ ఇస్మార్ట్ మూవీ భారీ అంచ‌నాల‌తో స్వాతంత్య్ర దినోత్స‌వం కానుక‌గా నిన్న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. సినిమాకు తొలి రోజు జ‌స్ట్ యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా కూడా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 12. 45 కోట్లు గ్రాస్ సాధించింది. షేర్ విషయానికి వస్తే… 7.30 కోట్లు. ఏపీ, తెలంగాణ‌లో కూడా ఏరియా వైజ్ చెప్పుకోద‌గ్గ వ‌సూళ్లే వ‌చ్చాయి.

ఏపీ – తెలంగాణ ఏరియా వైజ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ :

నైజాం – రూ. 2.49 కోట్
సీడెడ్ – రూ. 90 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 76 లక్షలు
ఈస్ట్ – రూ. 44 లక్షలు
వెస్ట్ – రూ. 23 లక్షలు
గుంటూరు – రూ. 70 లక్షలు
కృష్ణా – రూ. 38 లక్షలు
నెల్లూరు – రూ. 20 లక్షలు

ఏపీ, తెలంగాణ‌లో తొలి రోజు వ‌సూళ్లు చూస్తే రు 6.10 కోట్లు. ఇది షేర్‌. ఇక క‌ర్నాట‌క‌, రెస్టాఫ్ ఇండియా కలెక్షన్స్ చూస్తే రూ. 65 లక్షల షేర్ వచ్చింది. ఓవర్సీస్ విదేశాల్లో ఫస్ట్ డే షేర్ రూ. 55 లక్షలు. మాస్ సినిమాల‌కు ఓవ‌ర్సీస్‌లో అంత క‌లెక్ష‌న్లు ఉండ‌వు.. అయినా కూడా అక్క‌డ రు. 55 ల‌క్ష‌ల షేర్ అంటే ఎక్కువే అని చెప్పాలి. సినిమాకు జ‌స్ట్ యావ‌రేజ్ టాక్ ఉండ‌డంతో పాటు అటు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌, తంగలాన్‌, ఆయ్ సినిమాలు కూడా పోటీలో ఉండ‌డంతో ఈ పోటీని త‌ట్టుకుని రామ్ త‌న టార్గెట్‌ను ఎంత వ‌ర‌కు రీచ్ అవుతాడో ? చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news