ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా పూరి డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కించారు. ఇందులో రామ్ కు జోడిగా కావ్య థాపర్ యాక్ట్ చేసింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. అలాగే సాయాజీ షిండే, ప్రగతి, మకరంద్ దేశ్‌పాండే, ఝాన్సీ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. మణిశర్మ సంగీతం అందించారు.
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మితమైన డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్టు 15న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే తాజాగా డబుల్ ఇస్మార్ట్ ను చూసిన సెన్సార్ మెంబర్స్ సినిమాపై ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. రీసెంట్ గా సెన్సార్ కు వెళ్లిన ఈ చిత్రం ఏ సర్టిఫికెట్ తెచ్చుకుంది. రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలు అని తెలుస్తోంది.
ఇకపోతే డబుల్ ఇస్మార్ట్ మూవీ సెన్సార్ బోర్డు సభ్యులను విశేషంగా ఆకట్టుకుందట. బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్‌కు ఈ చిత్రం విపరీతంగా నచ్చుతుందని.. ఇస్మార్ట్ శంకర్ కు మించి మాస్ ఫీస్ట్ డబుల్ ఇస్మార్ట్‌లో ఉందని అభిప్రాయపడ్డారట. రామ్ క్యారెక్టర్రైజేషన్, అతని ఎనర్జీటిక్ యాక్టింగ్, సంజయ్ దత్-రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయట.
పూరి మార్క్ డైలాగ్స్ బాగా పేలాయాట. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ గా ఉందని సెన్సార్ మెంబర్స్ చెప్పారట. యాక్షన్, కామెడీ, హీరో-హీరోయిన్ లవ్ ట్రాక్, మదర్ సెంటిమెంట్ అద్భుతంగా వర్కోట్ అయ్యాయని తెలుస్తోంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లేకు కూడా మంచి మార్కులు వేశారట. ఓవరాల్‌గా సెన్సార్ సభ్యుల నుంచి డబుల్ ఇస్మార్ట్ కు పాజిటివ్ టాక్ లభించిందని సమాచారం. ఇక ఆడియెన్స్ ను కూడా ఈ చిత్రం మెప్పిస్తే.. రామ్-పూరి కాంబోకు మరో హిట్ ఖాయం అవుతుంది.