Moviesఈ చిన్నారి పెళ్లి కూతురు ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. త్వ‌ర‌లో టాలీవుడ్ హీరోకు...

ఈ చిన్నారి పెళ్లి కూతురు ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. త్వ‌ర‌లో టాలీవుడ్ హీరోకు వైఫ్ కాబోతోంది..!

పైన ఫోటోలో క‌నిపిస్తున్న చిన్నారి పెళ్లి కూతురు ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? ఒక్క సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఆ త‌ర్వాత పెద్ద‌గా సినిమాలు చేయ‌లేదు. అయితే త్వ‌ర‌లోనే ఆమె టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరోకు వైఫ్ కాబోతోంది. ఇంత‌కీ ఆమె మ‌రెవ‌రో కాదండీ.. రహస్య గోరక్. హైదరాబాదులో పుట్టి పెరిగిన రహస్య.. చిన్న‌త‌నం నుంచి నటి కావాలని ఆశ‌ప‌డింది.

అయితే అందుకు పేరెంట్స్ ఒప్పుకోక‌పోవ‌డం వ‌ల్ల స్ట‌డీస్ కంప్లీట్ చేసి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించింది. అయినా కూడా ర‌హ‌స్య‌కు యాక్టింగ్ ఆశ చావ‌లేదు. దాంతో ఉద్యోగం మానేసి ఆకాశమంత ప్రేమ, బాయ్స్ ఇన్ స్కూల్ వంటి షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. ప‌లు యాడ్స్ లో యాక్ట్ చేసింది. అనేక ఆడిష‌న్స్ అనంత‌రం రాజావారు రాణిగారు మూవీలో హీరోయిన్ గా సెల‌క్ట్ అయింది.

ఇదే సినిమాతో కిర‌ణ్ అబ్బ‌వ‌రం కూడా హీరోగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు. 2019లో రిలీజ్ అయిన రాజావారు రాణిగారు మంచి విజ‌యాన్ని సాధించింది. ఆ త‌ర్వాత కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా నిల‌దొక్కుకున్నాడు. జ‌య‌ప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. అయితే ర‌హ‌స్య‌కు మాత్రం పెద్ద‌గా ఛాన్సులు రాలేదు. ఇక‌పోతే రాజావారు రాణిగారు సినిమా స‌మ‌యంలో కిర‌ణ్‌, ర‌హ‌స్య మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. ఆ ప్రేమ పెళ్లికి దారితీసింది.

దాదాపు ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న కిర‌ణ్‌-ర‌హ‌స్య‌.. ఆగ‌స్టు 22న మూడు ముళ్ల బంధంతో ఒక‌టి కాబోతున్నారు. ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోనూ జంట కాబోతున్నారు. కూర్గ్‌లో వీరి మ్యారేజ్ జ‌ర‌గ‌బోతోంది. ప్ర‌స్తుతం ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ లో కిర‌ణ్, ర‌హ‌స్య ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కిరణ్ అబ్బవరంతో పెళ్లి నేపథ్యంలో రహస్య గోరక్ చైల్డ్‌హుడ్ ఫొటో నెట్టింట ట్రెండ్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news