Moviesఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. త్వ‌ర‌లో తెలుగు హీరోకు...

ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. త్వ‌ర‌లో తెలుగు హీరోకు భార్య కాబోతుంది..!

పైన ఫోటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తుపట్టారా..? ఆల్మోస్ట్ వంద‌లో 80 శాతం మంది ఆమె ఎవ‌రో గెస్ చేయ‌లేక‌పోతున్నారు. ఇంటర్నేషనల్ మోడల్‌లా కనిపిస్తున్న ఆ అందాల భామ మ‌న తెలుగు అమ్మాయే. తెనాలిలో పుట్టిన ఆమె.. వైజాగ్ లో పెరిగింది. త‌ద‌నంత‌రం ముంబైకి మకాం మార్చి మోడ‌ల్ గా మారింది. ఆ త‌ర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్, హాలీవుడ్‌, టాలీవుడ్ లో సినిమాలు చేసింది. త్వ‌ర‌లోనే ఓ తెలుగు హీరోకు భార్య కూడా కాబోతోంది. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదండీ శోభిత ధూళిపాళ్ల‌.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అయితే పైన మీరు చూస్తున్న ఫోటో ఇప్ప‌టి కాదు.. సుమారు 10 క్రితం ఫోటో. స్నేహితులు ప్రోత్సాహంలో కాలేజీ రోజుల్లో శోభిత మోడ‌లింగ్ లోకి ప్ర‌వేశించింది. 2013లో ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆపై ఫిలిప్పీన్స్‌లో మిస్ ఎర్త్ 2013 పోటీల్లో ఇండియాకు ఆమె ప్రాతినిధ్యం వహించింది. కానీ టైటిల్ ను గెలుచుకోలేక‌పోయింది.

2016లో రామన్ రాఘవ్ 2.0 అనే బాలీవుడ్ మూవీతో శోభిత సినీ రంగ ప్ర‌వేశం చేసింది. గూఢచారితో తెలుగు వారికి హాయ్ చెప్పింది. పొన్నియన్ సెల్వన్ తో సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక‌పోతే శోభిత త్వ‌ర‌లోనే అక్కినేని వారింటికి కోడ‌లు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. నాగ‌చైత‌న్య‌తో దాదాపు రెండేళ్ల నుంచి రిలేష‌న్ లో ఉన్న శోభిత‌.. అత‌నితో ఏడ‌డుగులు వేయ‌బోతోంది.

ఆగ‌స్టు 8న నాగార్జున నివాసంలో నాగ చైత‌న్య‌, శోభిత ఎంగేజ్మెంట్ జ‌రిగింది. అప్ప‌టి నుంచి శోభిత‌కు సంబంధించి అనేక విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మోడ‌ల్ గా ఉన్న రోజుల్లో శోభిత ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అయితే మేక‌ప్ ప్ర‌భావ‌మో లేక స‌ర్జ‌రీలు చేయించుకుందో తెలియ‌దు గానీ.. అప్ప‌టికీ ఇప్ప‌టికీ శోభిత చాలా మారిపోయింది. ఆమె ఈమె ఒక్క‌రే అంటే నెటిజ‌న్లు న‌మ్మ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news