Moviesనితిన్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇష్క్‌ మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్...

నితిన్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇష్క్‌ మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

యూత్ స్టార్ నితిన్ యాక్ట్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఇష్క్. ఒకరకంగా నితిన్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రమిది. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ డ్రామాలో నితిన్, నిత్యామీనన్ జంటగా నటించారు. అజయ్, సింధు తులాని, రోహిణి, నాగినీడు, సుధా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రను పోషించగా.. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు.

శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై సుధాకర్ రెడ్డి, విక్రమ్ గౌడ్ క‌లిసి నిర్మించిన ఇష్క్ చిత్రం.. 2012లో విడుద‌లై విమర్శకుల నుండి సానుకూల స్పందనను అందుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే రేంజ్ లో వసూళ్ల‌ను రాబ‌ట్టి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఆంధ్రా అంతటా 11 కేంద్రాలలో 100 రోజుల ర‌న్ ను పూర్తి చేసుకుంది. నితిన్ కెరీర్‌లో భారీ విజయాన్ని న‌మోదు చేసిన చిత్రంగా ముద్ర వేయించుకుంది.

ఉత్తమ హోమ్-వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్‌గా ఇష్క్ నంది అవార్డును గెలుచుకుంది. అలాగే ఒడియాలో అఖిరే అఖిరే, బంగ్లాదేశ్ బెంగాలీలో లవ్ స్టేషన్, భారతీయ బెంగాలీలో ఆషికి మరియు తమిళంలో ఉయిరే ఉయిరే పేర్ల‌తో రీమేక్ చేయబడింది. అయితే త‌క్కువ అంచ‌నాల‌తో వ‌చ్చి ఎక్కువ మంది హృదయాల‌ను దోచుకున్న ఇష్క్ మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ నితిన్ కాద‌న్న సంగ‌తి మీకు తెలుసా..? అవును మీరు విన్న‌ది నిజ‌మే.

డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ఈ మూవీని మొద‌ట టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరోతో చేయాల‌ని అనుకున్నాడ‌ట. ఆ హీరో మ‌రెవ‌రో కాదు మాస్ మ‌హారాజా ర‌వితేజ. విక్ర‌మ్ కుమార్ ర‌వితేజ‌ను క‌లిసి క‌థ చెప్ప‌డం కూడా జ‌రిగింద‌ట‌. అయితే అప్ప‌టికే క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ తో మాస్ ఇమేజ్ సంపాదించుకున్న ర‌వితేజ‌.. త‌న‌కు ఇటువంటి రొమాంటిక్ స్టోరీ సెట్ అవ్వ‌ద‌నే కార‌ణంతో సున్నితంగా ఇష్క్ ను రిజెక్ట్ చేశారు. దాంతో విక్ర‌మ్ కుమార్ మ‌రో ఆలోచ‌న లేకుండా నితిన్ తో సినిమా చేసి బిగ్ హిట్ కొట్టారు. అప్ప‌టికే 13 ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న నితిన్ ఇష్క్ తో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news