కథ డిమాండ్ చేస్తే సినీ తారలు ఏ సహాసం చేయడానికైనా సై అంటారు. ఆఖరికి ఆడ వేషం వేయడానికైనా వెనకాడరు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టులు లేడీ గెటప్ వేసి వినోదాన్ని పంచడం సాధారణమేగానీ.. హీరోలు అటువంటి రోల్స్ ప్లే చేయడమంటే పెద్ద సహాసమే. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, అల్లరి నరేష్, రాజేంద్ర ప్రసాద్ తో సహా పలువురు హీరోలు ఆ సహాసం చేశారు. అయితే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక సినిమాలో లేడీ గెటప్ వేశాడన్న సంగతి మీకు తెలుసా..? అవును మీరు విన్నది నిజమే.
ఓ పాత్ర కోసం మహేష్ బాబు చీరకట్టి, పూలు పెట్టుకుని అచ్చం అమ్మాయిలా హావభావాలు పలికించాడు. వయ్యారంగా నడుస్తూ హొయలొలికించాడు. ఇంతకీ మహేష్ బాబు లేడీ గెటప్ వేసిన సినిమా మరేదో కాదు బాలచంద్రుడు. టీనేజ్ లో మహేష్ బాబు యాక్ట్ చేసిన చిత్రమిది. ఘట్టమనేని కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబు ప్రధాన పాత్రను పోషించాడు.
కైకాల సత్యనారాయణ, గీత, రామిరెడ్డి, ఎం. ప్రభాకరరెడ్డి తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన బాలచంద్రుడు 1990 విడుదలై ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రంలోని ఒక సన్నివేశంలో రౌడీలను అట్రాక్ట్ చేసేందుకు మహేష్ బాబు లేడీ గెటప్ వేశాడు. చీరకట్టుకుని.. పూలు పెట్టుకుని తనదైన క్యూట్ యాక్టింగ్ తో వినోదాన్ని పంచాడు.
కెరీర్ మొత్తంలో మహేష్ బాబు లేడీ గెటప్ వేసిన ఏకైక చిత్రం బాలచంద్రుడు మాత్రమే. పూర్తి స్థాయి హీరోగా మారిన తర్వాత మహేష్ అటువంటి సహాసం ఎప్పుడూ చేయలేదు. ఒకవేళ చేసినా ఆయన అభిమానులు అస్సలు యాక్సెప్ట్ చేయలేరు అన్నది వాస్తవం. కాగా, మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళితో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. మహేష్ కెరీర్ లో 29వ ప్రాజెక్ట్ ఇది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.