Moviesచిరంజీవి కెరీర్ లో షూటింగ్ పూర్తయిన విడుద‌ల‌కు నోచుకోలేని ఏకైక సినిమా...

చిరంజీవి కెరీర్ లో షూటింగ్ పూర్తయిన విడుద‌ల‌కు నోచుకోలేని ఏకైక సినిమా ఏదో తెలుసా..?

ఎటువంటి సినీ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకు చిరంజీవి తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో 150 పైగా చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. అందులో కొన్ని సినిమాలు విజయం సాధిస్తే.. మరికొన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయితే నటుడిగా చిరంజీవి మాత్రం ఎప్పుడు ఓడిపోలేదు.

ఇకపోతే చిరంజీవి కెరీర్ లో షూటింగ్ పూర్తయిన రిలీజ్ కు నోచుకోలేని ఒక సినిమా ఉంద‌న్న సంగతి మీకు తెలుసా..? అవును మీరు విన్న‌ది నిజం. ఆ సినిమా పేరు శాంతి నివాసం. చిరంజీవి హీరోగా మాధవి హీరోయిన్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జ‌రిగింది. అయితే విడుద‌ల‌కు కొద్ది నెల‌ల ముందు శాంతి నివాసం చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన నిర్మాత హఠాత్తుగా మ‌ర‌ణించారు.

నిర్మాత మరణంతో ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. కొంత కాలం త‌ర్వాత అయినా శాంతి నివాసం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ఎవ‌రూ ఆస‌క్తి చూప‌లేదు. దాంతో చిరంజీవి కెరీర్ లో షూటింగ్ పూర్తయిన రిలీజ్ కు నోచుకోలేని ఏకైక సినిమాగా శాంతి నివాసం నిలిచిపోయింది. కాగా, చిరంజీవి ప్ర‌స్తుతం విశ్వంభ‌ర మూవీతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

మల్లిడి వసిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ సోసియో-ఫాంటసీ చిత్రంలో చెన్నై సోయగం త్రిష చిరంజీవికి జోడిగా న‌టిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి మరియు విక్రమ్ రెడ్డి క‌లిసి విశ్వంభ‌ర సినిమాను నిర్మింస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news