అక్కినేని హీరో నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. చైతుకు కాబోయే సతీమణి శోభిత మన తెలుగు ఆడపడుచు కావటం విశేషం. ఆమె స్వస్థలం గుంటూరు జిల్లాలోని తెనాలి. శోభిత పుట్టింది కూడా తెనాలిలోనే కావటం విశేషం. శోభిత వైజాగ్లో పెరిగింది. గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఆమె ఆ తర్వాత మేజర్ – పొన్నియన్ సెల్వన్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. శోభిత తండ్రి వేణుగోపాలరావు మర్చంట్ నేవీలో పనిచేశారు తల్లి శాంతారావు టీచర్.
ఎకనామిక్స్ సబ్జెక్ట్ అంటే శోభితకు బాగా ఇష్టం. ఇంటర్ అయ్యాక చదువు కోసం ఆమె ముంబై వెళ్ళింది. అయితే శోభిత స్నేహితురాలు ఆమెకు చెప్పకుండానే మిస్ ఇండియా పోటీలకు శోభిత పేరు ఇచ్చేసింది. అలా శోభిత 2013 మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచింది. ఆమె మిస్ ఇండియా పోటీల్లో రన్నరఫ్ అయినా కూడా సినీ అవకాశాల కోసం సగటు యువత లాగానే ఫోటోలు పట్టుకుని డైరెక్టర్లు చుట్టూ తిరిగింది.
శోభిత ప్రకటనలు చూసి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ రామన్ రాఘవన్ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇక శోభితకు భక్తి ఎక్కువ. ఉదయాన్నే ఆమె పూజ చేస్తుంది. రోజు సూర్యాష్టకం చదువుతుంది. వీలు కుదిరినప్పుడల్లా ఆలయాలను కూడా సందర్శిస్తూ ఉంటుంది. ఆమె పూర్తిగా శాకాహారి.. బయట తినడానికి కూడా పెద్దగా ఇష్టపడరు.. ఇంట్లో పనులకి కూడా ఎవరిమీద ఆధారపడకుండా చేసుకుంటారట. ఆమె భరత నాట్యం.. గిటార్ కూడా నేర్చుకున్నారు.