Moviesనాగ‌చైత‌న్య - శోభిత మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా… చై...

నాగ‌చైత‌న్య – శోభిత మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా… చై కాబోయే భార్య ఎంత చిన్నది అంటే..?


టాలీవుడ్ లో అక్కినేని హీరో నాగచైతన్య – హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారని … త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు వీరిద్దరూ కలిసి చాలాసార్లు విదేశాల్లో శికార్లు చేసిన ఫోటోలు కూడా వైరల్ అవుతూ వస్తున్నాయి. దీనిపై అటు చైతు .. ఇటు శోభిత పెద్దగా స్పందించలేదు. ఇక ఎట్టకేలకు వీరిద్దరి పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. ఈరోజు హైదరాబాదులో అక్కినేని – శోభిత కుటుంబాలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని ఎంగేజ్మెంట్.. పెళ్లిపై నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది

ఎంగేజ్మెంట్‌పై నాగార్జున ఫొటోలు రిలీజ్ చేసి మ‌రీ క్లారిటీ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో కాబోయే ఈ జంటకు శుభాకాంక్షలు వెళ్లు వెత్తుతున్నాయి. ప్రస్తుతం నాగచైతన్య తండేల్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగచైతన్యకు ఇంతకుముందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో వివాహం జరిగింది. నాలుగేళ్ల పాటు కలిసి కాపురం చేసిన ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మళ్లీ మరో హీరోయిన్ శోభితను చైతు పెళ్లి చేసుకోనుడడంతో ఈ జంట గురించి కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

ఇక నాగచైతన్య 1986 నవంబర్ 23న నాగార్జున .. రామానాయుడు కుమార్తె లక్ష్మీ దంపతులకు జన్మించారు. చైతు జన్మించాక లక్ష్మీ – నాగార్జున మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఇక శోభిత ధూళిపాళ్ల స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని తెనాలి. వేణుగోపాలరావు – శాంత దంపతులకు 1993 మే 31న శోభిత జన్మించింది. విశాఖపట్నంలోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్ – విశాఖ వ్యాలీ పాఠశాలలో ఆమె చదువుకుంది. ముంబై యూనివర్సిటీ నుంచి హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ – ఎకనామిక్స్ పూర్తి చేసింది.

సాంప్రదాయం… నృత్యాలు అయిన భరతనాట్యం – కూచిపూడిలో శిక్షణ తీసుకుంది. అలాగే 2013 ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచింది. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించింది.. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ సినిమాలో ఆమె నటించింది. 2018 లో తెలుగులో వచ్చిన గూఢచారి… 2022లో వచ్చిన మేజర్ సినిమాలతో హిట్లు కొట్టింది. ఇక నాగచైతన్య – శోభిత మధ్య ఏడు సంవత్సరాల వయసు గ్యాప్ ఉంది. వీరిద్దరి జోడి పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news