ఆగస్టు 15 కానుకగా మొత్తం నాలుగు సినిమాలు టాలీవుడ్ లో రిలీజ్ అయ్యాయి. రవితేజ మిస్టర్ బచ్చన్ – రామ్ డబుల్ ఇస్మార్ట్ – నార్నే నితిన్ ఆయ్ – తమిళ డబ్బింగ్ సినిమా విక్రమ్ నటించిన తంగలాన్. ఈ నాలుగు సినిమాలలో పోటాపోటీ అంచనాలతో మిస్టర్ బచ్చన్ – డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. నాలుగు సినిమాలలో అతిపెద్ద డిజాస్టర్ ఏది ? అని అడిగితే ముందుగా అందరూ మిస్టర్ బచ్చెన్ సినిమా పేరు చెబుతున్నారు. అసలు ఈ సినిమా ఎందుకు తీశారు ? అని తలలు పట్టుకుంటున్నారు. బాలీవుడ్ లో హిట్ అయిన రైడ్ సినిమాకు రీమేక్‌గా దర్శకుడు హరీశంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.
హీరోయిన్ బాగుంది.. పాటలు బాగున్నాయి.. కామెడీ ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ సినిమా తొలి రోజుకే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ప్రీమియర్లు వేయటం సినిమాకు ముందు రోజే నెగటివ్ టాక్ రావడం జరిగిపోయాయి.. నైజంలో ఈ సినిమాకు కాస్త అటు ఇటుగా 12 నుంచి 13 కోట్ల షేర్ వస్తేనే హిట్ అయినట్టు.. కానీ రెండు కోట్లు మాత్రమే వచ్చాయని ప్రాథమిక సమాచారం. నిర్మాత కూడా బాధపడుతున్నారని తన వంతుగా ప్రతి ఒక్కరికి సాయం చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తోంది.
సాయం చేయటం చేయకపోవడం అన్నది పాయింట్ కాదు… మరీ ఇంత నాసిరకం సినిమా తీసి ప్రేక్షకుల మీదకు వదలటం దర్శకుడుదే పూర్తిగా తప్పు అని చెప్పాలి. ఇక హీరో రవితేజ కూడా రెమ్యూనరేషన్ కోసం చూడకుండా కథాబలం ఉన్న సినిమాలు చేసుకుంటే మంచిది. రవితేజకు ఇటీవల కాలంలో క్రాక్, ధమకా మాత్రమే హిట్లు.. ఈ రెండు సినిమాలకు ముందూ.. వెనకా చూసుకుంటే కనీసం ఓ డజను సినిమాలు డిజాస్టర్లు… అయినా అతడు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి ఎందుకు సినిమాలు తీస్తున్నారో వాళ్లకే తెలియట్లేదు.