క్రియేటిక్ డైరెక్టర్ కృష్ణ వంశీ, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో సుమారు 23 ఏళ్ల క్రితం వచ్చిన క్లాసిక్ హిట్ మురారి. ఈ సినిమాతోనే సోనాలి బింద్రే హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది. సూపర్ నేచురల్ ఫ్యామిలీ డ్రామాగా రూపుదిద్దుకున్న మురారి చిత్రం 2001 ఫిబ్రవరి 17న విడుదలై పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. స్టోరీ, కృష్ణవంశీ మార్క్ ఎమోషన్స్, క్యారెక్టర్లు, క్యారెక్టరైజేషన్లతో పాటు అందమైన పాటలు సినిమా విజయంలో కీలక పాత్రను పోషించాయి.
మురారి మూవీతో మహేష్ బాబు ఇటు అభిమానులతో పాటు అటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి మరింత చేరువ అయ్యాడు. మహేష్ కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాను రీసెంట్ గా రీరిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. రీరిలీజ్ లో తొలిరోజు వరల్డ్ వైడ్‌గా మురారి రూ. 5.41 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి దుమ్ము దుమారం రేపింది. ఇప్పటి వరకు రీరిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.
ఇదే తరుణంలో మురారి సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ క్లాసిక్ హిట్ ను మహేష్ బాబు చేయడం కన్నా ముందు బడా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఓ టాలీవుడ్ హీరో మిస్ చేసుకున్నాడట. ఆ అన్ లక్కీ హీరో మరెవరో కాదు సుమంత్ యార్లగడ్డ. నిన్నే పెళ్లాడతా సినిమా టైమ్ నుంచే కృష్ణవంశీ, నాగార్జున మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అయితే అనుకోకుండా ఒకసారి మురారి స్టోరీ లైన్ ను కృష్ణవంశీ నాగార్జునకు వినిపించారట.
కథ బాగా నచ్చడంలో మురారి సినిమాను తన మేనల్లుడు సుమంత్ తో తీయమని నాగార్జున అడిగారట. కావాలంటే నిర్మాతగా కూడా వ్యవహరిస్తానని చెప్పారట. కానీ కృష్ణవంశీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అయితే మీతో తీస్తాను.. లేదంటే మహేష్ బాబుతో తీస్తానని కృష్ణవంశీ ఓపెన్ గా చెప్పేశారట. దాంతో నాగార్జున కొంచెం హర్ట్ అయినట్లు కూడా అప్పట్ల ప్రచారం జరిగింది. ఇక ఫైనల్ గా కృష్ణవంశీ మహేష్ బాబుతో మురారి తీసి బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఒకవేళ సుమంత్ కనుక ఈ సినిమా చేసుంటే ఆయన కెరీర్ మరోలా ఉండేది అనడంలో ఎటువంటి సందేహం లేదు.